tangalan: 'తంగలాన్‌' ప్రీ రిలీజ్‌ లో సుమక్కకి షాక్ ...స్టేజ్ మీదే ముద్దులు పెట్టిన నటుడు

సుమకు కూడా షాకిచ్చాడు ఓ నటుడు.నిన్న జరిగిన ప్రీరిలీజ్‌ ఈవెంట్‌లో 'తంగలాన్'‌ నటుడు డెనియల్‌ సుమకు కిస్‌ ఇవ్వడంతో ఆమె ఒక్కసారిగా షాక్‌ గురైంది. ఇప్పుడు ఈ వీడియో ఫుల్ వైరల్ అవుతుంది.


Published Aug 05, 2024 02:25:58 PM
postImages/2024-08-05//1722848158_suma.webp

న్యూస్ లైన్, స్పెషల్ డెస్క్ : యాంకర్  సుమ గురించి తెలియని తెలుగురాష్ట్ర ప్రజలు లేరు. ఎన్నో యేళ్ల నుంచి ఇండస్ట్రీ లో ప్రీ రిలీజ్ ఈవెంట్ లు , ఎన్నో షోలు  చేస్తూ చాలా యేళ్లు గా బిజీగా ఉన్న యాంకర్.కామెడీ పంచులతో సెలబ్రిటీలకు సైతం షాకిస్తుంది. స్టార్‌ హీరోలను కూడా తన ప్రశ్నలతో ఇబ్బంది పెడుతుంది. సుమకు కూడా షాకిచ్చాడు ఓ నటుడు.నిన్న జరిగిన ప్రీరిలీజ్‌ ఈవెంట్‌లో 'తంగలాన్'‌ నటుడు డెనియల్‌ సుమకు కిస్‌ ఇవ్వడంతో ఆమె ఒక్కసారిగా షాక్‌ గురైంది. ఇప్పుడు ఈ వీడియో ఫుల్ వైరల్ అవుతుంది. త‌మిళ స్టార్ హీరో చియాన్ విక్ర‌మ్ నటిస్తున్న లేటెస్ట్‌ మూవీ 'తంగలాన్‌'. డైరెక్టర్  పా రంజిత్ డైరక్షన్ లో వస్తున్న ఈ సినిమా  ఆగష్టు 15న వరల్డ్‌ వైడ్‌గా రిలీజ్ కాబోతుంది.


అలాగే తంగలాన్‌లో కీలక పాత్ర పోషించిన నటుడు డెనియల్‌ను కూడా స్టేజ్‌కి పిలిచింది. ఆయనను తెలుగులో మాట్లాడించే ప్రయత్నం చేసింది. అలా తెలుగులో ఆయనతో మాట్లడించిన సుమకు డెనియల్‌ అనుకోని షాకిచ్చాడు. "ఈ సినిమాను ఆగస్ట్‌ 15న అందరు తప్పుకుండ చూడాలని, ఇక్కడ ఉన్న అందరు అమ్మాయిల్లో సుమనే అందంగా ఉంది" ఆయనతో ఇలా తెలుగులో మాట్లాడించింది. ఆనంతరం సుమ థ్యాంక్యూ అంటూ ఆయనకు షేక్‌ హ్యాండ్‌ ఇవ్వగా.. ఆయన వెంటనే ఆమె చేయికి ముద్దు పెట్టాడు. ఈ కిస్సుకి  సుమక్క కూడా షాకయ్యింది. వెంటనే ఈ సిట్యువేషన్ ను ఫన్నీగా మార్చేసింది. అన్నయ్య సన్నిధి అంటూ ఎవ్వరు తప్పుగా అనుకోకుండా కవర్ చేసేసింది.


ఇక ఆ వెంటనే దీని గురించి ఎవరైనా రాశారో అంటూ చివరిలో స్వీట్ వార్నింగ్‌ ఇచ్చింది. సోషల్ మీడియాలో ఫుల్ వైరల్ అవుతుంది. కాని సుమ మాత్రం షాకవుతుంది.
 

newsline-whatsapp-channel
Tags : newslinetelugu movie-news suma-kanakala

Related Articles