30 ఏళ్లుగా నేను సంపాదించుకున్న పేరును పాడుచేశారు. నేను చేయించుకున్న కొన్ని టెస్టుల్లో నాకు నెగెటివ్ రిపోర్టు వచ్చింది. నేను ఎలాంటి టెస్టుకైనా సిద్ధం. తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ అపాయింట్ మెంట్ అడిగేందుకే ఈ వీడియో పెడుతున్నా. వారిని కలిసి చాలా విషయాలు చెప్పాల్సి ఉంది’ అంటూ హేమ చేసిన వీడియో ఇప్పుడు వైరల్ గా మారింది.
న్యూస్ లైన్ డెస్క్ : గత రెండు నెలల క్రితం బెంగళూరులో నిర్వహించిన రేవ్ పార్టీలో హేమ పాల్గొన్నట్టు వార్తలు వచ్చిన విషయం తెలిసిందే. ఈ రేవ్ పార్టీలో పలువురు సినిమా నటులు పాల్గొన్నట్టు వచ్చిన వార్తలు సినీ ఇండస్ట్రీలో దుమారం రేపాయి. అయితే.. రేవ్ పార్టీకి వెళ్లలేదని.. ఇంట్లోనే ఉన్నానని నమ్మించేందుకు హేమ చాలా హైడ్రామా చేసింది. కేసు నమోదు చేసిన పోలీసులు విచారణ చేసి ఆమె డ్రగ్స్ తీసుకున్నట్టు డిక్లేర్ చేశారు. పరీక్షలు చేసి నోటీసులు కూడా ఇచ్చారు. విచారణ కోసం కొద్దిరోజులు జైల్లో కూడా ఉంచారు. బెయిల్ మీద బయటకొచ్చిన హేమ మీద అప్పట్లో ట్రోల్స్, మీమ్స్ చాలా వచ్చాయి.
రేవ్ పార్టీ ముద్ర చెరిపేసుకునేందుకు చాలా ఇంటర్వ్యూల్లో కవర్ చేసుకునేందుకు ట్రై చేసింది. అయితే.. తాజాగా హేమ తన ఇన్ స్టాగ్రామ్ వేదికగా ఓ సంచలన వీడియో పోస్ట్ చేసి ట్విస్ట్ ఇచ్చింది. గత కొన్ని నెలల క్రితం నా మీద మీడియాలో చాలా పుకార్లు వచ్చాయి. 30 ఏళ్లుగా నేను సంపాదించుకున్న పేరును పాడుచేశారు. నేను చేయించుకున్న కొన్ని టెస్టుల్లో నాకు నెగెటివ్ రిపోర్టు వచ్చింది. నేను ఎలాంటి టెస్టుకైనా సిద్ధం. తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ అపాయింట్ మెంట్ అడిగేందుకే ఈ వీడియో పెడుతున్నా. వారిని కలిసి చాలా విషయాలు చెప్పాల్సి ఉంది’ అంటూ హేమ చేసిన వీడియో ఇప్పుడు వైరల్ గా మారింది.