గతంలో కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ వీడి బీజేపీలో చేరిన సమయంలో అద్దంకి దయాకర్ ఘాటుగా స్పందించారు. అప్పుడే కోమటిరెడ్డి వెంకట్ రెడ్డిని కూడా పరుష పదజాలంతో దూషించారు. కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి ఢిల్లీలో అమిత్ షాను కలుస్తానని చెప్పుకొని పర్యటనలకు వెళ్లారని మండిపడ్డారు. కాంగ్రెస్‌కు రాజీనామా చేసిన రాజగోపాల్ రెడ్డి విషయంలో వెంకట్ రెడ్డి స్పందించాలని అద్దంకి దయాకర్ డిమాండ్ చేశారు. లేదంటే పార్టీ నుంచి వెళ్లిపోవాలని పరుష పదజాలంతో తిట్ల దండకం అందుకున్నారు.
న్యూస్ లైన్ డెస్క్: మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డికి కాంగ్రెస్ నేత అద్దంకి దయాకర్ అంటే పడదని విషయం కొత్తగా చెప్పుకోవాల్సిన పని లేదు. ఒకే పార్టీకి చెందిన నేతలు అయినప్పటికీ పచ్చి గడ్డి వేస్తే మండుతుందా అనేంతలా అద్దంకి, కోమటిరెడ్డి బ్రదర్స్‌కు మధ్య వైరం ముదిరింది.
గతంలో కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ వీడి బీజేపీలో చేరిన సమయంలో అద్దంకి దయాకర్ ఘాటుగా స్పందించారు. అప్పుడే కోమటిరెడ్డి వెంకట్ రెడ్డిని కూడా పరుష పదజాలంతో దూషించారు. కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి ఢిల్లీలో అమిత్ షాను కలుస్తానని చెప్పుకొని పర్యటనలకు వెళ్లారని మండిపడ్డారు. కాంగ్రెస్‌కు రాజీనామా చేసిన రాజగోపాల్ రెడ్డి విషయంలో వెంకట్ రెడ్డి స్పందించాలని అద్దంకి దయాకర్ డిమాండ్ చేశారు. లేదంటే పార్టీ నుంచి వెళ్లిపోవాలని పరుష పదజాలంతో తిట్ల దండకం అందుకున్నారు.
అప్పటి నుండి అద్దంకిపై కోమటిరెడ్డి బ్రదర్స్ కోపంగా ఉన్న విషయం తెలిసిందే. ఇక అప్పటినుండి అద్దంకి దయాకర్‌కు తుంగతుర్తి ఎమ్మెల్యే టికెట్ రాకుండా, ఎమ్మెల్సీ పదవి రాకుండా, ఎంపీ పదవి రాకుండా కోమటిరెడ్డి బ్రదర్స్ అడ్డుపడుతున్నారని వార్తలు కూడా వచ్చాయి. ఇక తాజగా, అద్దంకి దయాకర్ హీరోగా నటించిన ఇండియా ఫైల్స్ సినిమా ఆడియో రిలీజ్ కార్యక్రమానికి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి హాజరయ్యారు. ఇందులో భాగంగానే వెంకట్ రెడ్డి కాళ్లు అద్దంకి దయాకర్ మొక్కినట్లు తెలుస్తోంది. దీంతో ఈ ఇద్దరి మధ్య వైరం ముగిసిందా అనే చర్చ జెడ్పీరుగా సాగుతోంది.