డీఎస్సీ నోటిఫికేషన్ వచ్చిన నాలుగు నెలల్లోనే పరీక్ష నిర్వహిస్తున్నారని రవిచందర్ తెలిపారు. తక్కువ సమయంలో పరీక్షల కోసం చదువుకోవడం విద్యార్థులకు కష్టతరంగా మారిందని ఆయన అన్నారు. మరోవైపు గ్రూప్స్ పరీక్షను కూడా ఈ రకంగానే నిర్వహించడం వల్ల అభ్యర్థులు ఒత్తిడికి గురవుతున్నారని తెలిపారు. అందుకే పరీక్షల వాయిదా కోసం నిరుద్యోగులు, అభ్యర్థులు ఆందోళనలు చేపట్టారని న్యాయస్థానానికి వివరించారు.
న్యూస్ లైన్ డెస్క్: డీఎస్సీ పరీక్షను వాయిదా వేయాలంటూ దాఖలైన పిటిషన్‌పై గురువారం హైకోర్టులో విచారణ జరిగింది. నిరుద్యోగుల తరఫున సీనియర్ అడ్వకేట్ రవిచందర్ వాదనలు వినిపించారు. ప్రభుత్వం తరఫున అడిషనల్ అడ్వకేర్ జనరల్ రజనీకాంత్ రెడ్డి వాదించారు.
డీఎస్సీ నోటిఫికేషన్ వచ్చిన నాలుగు నెలల్లోనే పరీక్ష నిర్వహిస్తున్నారని రవిచందర్ తెలిపారు. తక్కువ సమయంలో పరీక్షల కోసం చదువుకోవడం విద్యార్థులకు కష్టతరంగా మారిందని ఆయన అన్నారు. మరోవైపు గ్రూప్స్ పరీక్షను కూడా ఈ రకంగానే నిర్వహించడం వల్ల అభ్యర్థులు ఒత్తిడికి గురవుతున్నారని తెలిపారు. అందుకే పరీక్షల వాయిదా కోసం నిరుద్యోగులు, అభ్యర్థులు ఆందోళనలు చేపట్టారని న్యాయస్థానానికి వివరించారు.
గ్రూప్ 1, 2 వాయిదా.. సర్కార్ ఫిక్స్ అయిందా?
పదిమంది కోసం 2.45 లక్షల మంది నిరుద్యోగులను బలి చేయలేమని సర్కార్ తరఫున వధించిన లాయర్ రజనీకాంత్ రెడ్డి అన్నారు. కోర్టులో పిటిషన్ దాఖలు చేరిన వారు అసలు పరీక్షలకు దరఖాస్తు చేసారా అని ఆయన ప్రశ్నించారు. దీనికి స్పందించిన పిటిషన్ తరఫు లాయర్ గ్రూప్-1తో పాటు డిఏవో, డీఎస్సీకి కూడా అప్లై చేశారని అన్నారు.
డీఎస్సీకి సంబంధించిన హాల్ టికెట్‌ను పిటిషన్‌లో జతచేయకపోవడంపై ప్రభుత్వం తరఫు లాయర్ అభ్యంతరం వ్యక్తం చేశారు. దీంతో కౌంటర్ దాఖలు చేయాలని ప్రభుత్వం తరఫు న్యాయవాదికి హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. ఈ మేరకు విచారణను జులై 28కి వాయిదా వేస్తున్నట్లు న్యాయస్థానం వెల్లడించింది.