VIJAY: ‘ది గోట్’ మూవీలో AI వాడకం ..విజయ్ కాంత్ తో కూడా యాక్ట్ చేయించారుగా ..!

ది గోట్ మూవీలో దళపతి విజయ్ డ్యూయల్ రోల్‌లో కనిపించాడు. ఒక పాత్ర యంగ్ లుక్ లో కనిపిస్తూ ఆకట్టుకున్నాడు.


Published Sep 05, 2024 04:22:00 PM
postImages/2024-09-05/1725533681_GOAT.webp

న్యూస్ లైన్, స్పెషల్ డెస్క్: ఈ మధ్య కాలంలో ఏఐ తో కల్కీ లో అమితాబ్ ను యంగ్ చేశారు. అదిరిపోయింది కూడా. ఇప్పుడు ఈ లిస్ట్ లో మరో సినిమా ..చేరింది. కోలీవుడ్ స్టార్ దళపతి విజయ్ సినిమా దిగోట్ మూవీలో విజయ్ కాంత్ ను ఏఐ తో క్రియేట్ చేశారు. ది గోట్ మూవీలో దళపతి విజయ్ డ్యూయల్ రోల్‌లో కనిపించాడు. ఒక పాత్ర యంగ్ లుక్ లో కనిపిస్తూ ఆకట్టుకున్నాడు.


తెరపై విజయ్ కాంత్ కనిపించగానే  థియేటర్లలో విజిల్స్, చప్పట్లతో మారుమోపోయింది. కెప్టెన్ తెర మీద కనిపించగానే ...అందరు విజిల్స్, కేకలు పెట్టారు.  గత ఏడాది డిసెంబర్ 28న అనారోగ్యం కారణంగా ఆయన కన్నుమూశారు.సినిమాల్లో మంచి క్రేజ్ ఉండగానే రాజకీయాల్లో అడుగులు వేశారు.‘నేషనల్ ప్రొగ్రెసీవ్ ద్రవిడ కజకం’ అనే పార్టీ స్థాపించారు. ఆయన మరణం తమిళ ప్రజలకు చేదు నిజం.


డైరెక్టర్ వెంకట ప్రభు స్వయంగా విజయ్ కాంత్ సతీమణి ప్రేమలత విజయ్ కాంత్‌ను సంప్రదించి ఆమె పరిమిషన్ తీసుకున్నారట. చాలా యేళ్ల తర్వాత విజయ్ కాంత్ ను ఇలా థియేటర్ లో స్క్రీన్ మీద చూసిన తమిళ ఆడియన్స్ కు ఫ్యూజులు ఎగిరిపోయాయి..  ‘వీ మిస్ యూ కెప్టెన్’ అంటూ ఆయనకు నివాళులర్పించారు. మొత్తానికి ఏఐ టెక్నాలజీతో ఇప్పుడు వెండి తెరపై ఎన్నో అద్భుతాలు సృష్టిస్తున్నారు. ఏఐ వల్ల ఇలాంటి మంచి విషయాలు కూడా జరుగుతాయంటున్నారు ఫ్యాన్స్ . ఎన్నో యేళ్ల క్రితమే..కెప్టెన్ ను మిస్ అయ్యామని మళ్లీ ఇలా చూడడం హ్యపీ అంటున్నారు విజయ్ కాంత్ ఫ్యాన్స్ .
 

newsline-whatsapp-channel
Tags : artificial-intelligence movie-news dalapathi-vijay

Related Articles