బాలీవుడ్ లో మోస్ట్ బ్యూటిపుల్ కపుల్ అంటే అభిషేక్ ..ఐశ్వర్యనే. 2007లో ఐశ్వర్యరాయ్,అభిషేక్ బచ్చన్ ప్రేమ వివాహం చేసుకున్నాడు
న్యూస్ లైన్, స్పెషల్ డెస్క్: బాలీవుడ్ లో మోస్ట్ బ్యూటిపుల్ కపుల్ అంటే అభిషేక్ ..ఐశ్వర్యనే. 2007లో ఐశ్వర్యరాయ్,అభిషేక్ బచ్చన్ ప్రేమ వివాహం చేసుకున్నాడు. వీరికి ఆరాధ్య అనే పాప కూడా ఉంది.బాలీవుడ్ లో ఇప్పుడు ఈ జంట విడాకుల గురించే తెగ గుసగుసలాడుకుంటున్నారు. అంబానీ ఇంట్లో పెళ్లికి.. విడివిడిగా ..వెళ్లడం కూడా ఈ గాసిప్ కు ఊతం ఇచ్చింది.
చాలా సార్లు మేం విడపోలేదు సామి...ఎందుకు ఈ గోలంతా అని అడిగినా పదే పదే ...ఇదే రాస్తున్నారు. దీంతో సహనం కోల్పోయిన అభిషేక్ బచ్చన్..మా విడాకులు నిజమే.. ఈ విషయం మాకు చెప్పినందుకు మీకు ధన్యవాదాలు. మరి ఆ తర్వాత మేము చేసుకోబోయే పెళ్లి గురించి కూడా మీరే చెప్పండంటూ కాస్తా ఘాటుగానే రియాక్ట్ అయ్యారు.
ఐశ్వర్యకు నాకు లైఫ్ మీద చాలా క్లారిటీ ఉంది. ఎలా ముందుకు వెళ్లాలి.. ఎలా బతకాలి అనేది పూర్తిగా తెలుసు. ఎవరో మూడో వ్యక్తి మా జీవితంలోకి వచ్చి మాట్లాడాల్సిన అవసరం లేదంటూ అభిషేక్ తెలిపారు. నాకు ఐశ్వర్య పై ఎంత ప్రేమ ఉందో ఆమెకు తెలుసు.. ఆమెకు నాపై ఎంత ప్రేమ ఉందో నాకు తెలుసు.. మా ప్రేమ గురించి మీకు తెలియజేయాల్సిన అవసరం లేదని ఆయన చెప్పుకొచ్చారు.
లైఫ్ లో ఎప్పుడైనా ..సమస్య వస్తే మేం ఇద్దరం చూసుకుంటాం. మీరు ఇన్వాల్వ్ కాకండి. లైఫ్ లో ..ఎవ్వరి పని వారిని చెయ్యనివ్వండి అంటూ అభిషేక్ చెప్పుకొచ్చారు.