Shobhitha:అక్కినేని కోడలు అదిరిపోయే హోయలు.!

బాలీవుడ్ స్టార్ హీరోయిన్ శోభిత ధూళిపాళ్ల అంటే తెలియని వారు ఉండరు. అయితే మొన్నటి వరకు ఈమంటే ఎక్కువ మందికి తెలియలేదు కానీ తాజాగా నాగచైతన్యతో ఎంగేజ్మెంట్ జరిగిన తర్వాత ఈమె పేరు


Published Aug 23, 2024 06:49:52 AM
postImages/2024-08-23/1724410151_sobitha12.jpg

న్యూస్ లైన్ డెస్క్: బాలీవుడ్ స్టార్ హీరోయిన్ శోభిత ధూళిపాళ్ల అంటే తెలియని వారు ఉండరు. అయితే మొన్నటి వరకు ఈమంటే ఎక్కువ మందికి తెలియలేదు కానీ తాజాగా నాగచైతన్యతో ఎంగేజ్మెంట్ జరిగిన తర్వాత ఈమె పేరు మార్మోగిపోతోంది. సోషల్ మీడియాలో ఎక్కడ చూసినా శోభిత, సమంతా, నాగ చైతన్యల గురించి వార్తలు వినిపిస్తున్నాయి. అలా శోభిత ధూళిపాళ్ల మోడల్ గా కెరియర్ స్టార్ట్ చేసి సినీ రంగంలో మంచి గుర్తింపు తెచ్చుకుంది.

ప్రస్తుతం స్టార్ హీరోయిన్ రేంజ్ లో ఉన్న ఈమె  వచ్చిన ప్రతి అవకాశాన్ని ఉపయోగించుకుంటుంది. అయితే ఈ ముద్దుగుమ్మ పొన్నియన్ సెల్వన్, గోస్ట్ స్టోరీస్, గూడచారి వంటి చిత్రాల్లో నటించి మెప్పించింది. అలాంటి ఈ ముద్దుగుమ్మ సోషల్ మీడియాలో ఎప్పుడూ యాక్టివ్ గా ఉంటూ  అభిమానులను మెస్పరైజ్ చేస్తూనే ఉంటుంది. తనకు సంబంధించిన హాట్ ఫోటోలు, వీడియోలను షేర్ చేసి కుర్రకారుకు నిద్రలేకుండా చేస్తుంది. 

 ఎప్పుడైతే నాగ్ చైతన్యతో ఈమె ఎంగేజ్మెంట్ జరిగిందో అప్పటినుంచి సోషల్ మీడియాలో మరింత యాక్టివ్ అయిపోయింది. రోజురోజుకు కొత్త లుక్స్ తో  అదరహో అనిపిస్తుంది. అయితే తాజాగా వైట్ కలర్ దుస్తులు ధరించి కిల్లింగ్ లుక్స్ తో  అద్భుతమైన ఫోజు ఇచ్చింది. ఇది చూసిన నేటిజన్స్ సూపర్ లుక్, నాగచైతన్యకు ఈడు జోడు అంటూ కామెంట్లు పెడుతున్నారు. ప్రస్తుతం ఈ ఫోటోలు సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతున్నాయి. ఆ ఫోటోలను మీరు కూడా చూసేయండి.

 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by Sobhita (@sobhitad)

newsline-whatsapp-channel
Tags : newslinetelugu samantha nagachaitanya- hot-looks sobhita-dhulipala

Related Articles