Alluarjun:మెగాస్టార్ కి బన్నీ బర్త్ డే విషెస్..మరి ఇలా చెప్పావేంటి బాసు.!

తెలుగు ఇండస్ట్రీలో అత్యధిక అభిమాన సంఘాలు ఎవరికి ఉన్నాయి అంటే అది చిరంజీవి ఫ్యామిలీకి అని చెప్పవచ్చు. అలాంటి చిరంజీవికి సంబంధించిన ఎలాంటి విషయాలు బయటకు వచ్చిన


Published Aug 22, 2024 02:22:59 AM
postImages/2024-08-22/1724309673_chiruallu.jpg

న్యూస్ లైన్ డెస్క్: తెలుగు ఇండస్ట్రీలో అత్యధిక అభిమాన సంఘాలు ఎవరికి ఉన్నాయి అంటే అది చిరంజీవి ఫ్యామిలీకి అని చెప్పవచ్చు. అలాంటి చిరంజీవికి సంబంధించిన ఎలాంటి విషయాలు బయటకు వచ్చిన అభిమానులు చాలా సంబర పడిపోతారు. ఆగస్టు 22 వచ్చింది అంటే మెగాస్టార్ బర్త్డే రోజున  రెండు తెలుగు రాష్ట్రాల్లో అభిమానులంతా వేడుకల జరుపుకుంటారు. అలా మెగాస్టార్ చిరంజీవి బర్త్డే రోజున  ఎంతోమంది  బర్త్డే విషెస్ కూడా చెబుతూ ఉంటారు. అయితే ఈరోజు ఆయన పుట్టినరోజు సందర్భంగా ఇప్పటికే ఆయన పాత చిత్రం అయినటువంటి ఇంద్ర సినిమాలు రిలీజ్ చేశారు.

అంతేకాకుండా ఆయనకు సినిమా ఇండస్ట్రీలోని ప్రముఖులు,  హీరోయిన్లు, రాజకీయ నాయకులు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. ఇదే తరుణంలో ఒక చిన్న వార్త నిన్నటి నుండి వైరల్ అవుతుంది.  చిరంజీవి పుట్టినరోజు సందర్భంగా అల్లు అర్జున్ ఏ విధంగా విషెస్ చెబుతారు అనేది ఆసక్తికరంగా మారింది. అలా అందరూ ఎదురు చూస్తున్న తరుణంలో అల్లు అర్జున్ చిరంజీవికి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు. ఆయన ఒక్క ముక్కలో శుభాకాంక్షలు చెప్పి ముగించారు.. ట్విట్టర్ వేదికగా అల్లు అర్జున్ స్పందిస్తూ "మెగాస్టార్ చిరంజీవి గారికి మెనీ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ది డే" అంటూ శుభాకాంక్షలు చెప్పారు. దీంతో మెగా అభిమానులంతా కోపానికి వస్తున్నారు.

సినిమా లైఫ్ ఇచ్చిన మీకు  ఒక్క ముక్కలో శుభాకాంక్షలు చెబుతావా అంటూ అభ్యంతరాలు వ్యక్తం చేస్తున్నారు. అయితే చిరంజీవి ఫ్యామిలీకి మరియు అల్లు ఫ్యామిలీకి అప్పుడప్పుడు ఇలాంటి  వార్ జరుగుతూనే ఉంటుంది. తాజాగా ఎన్నికల సమయంలో అల్లు అర్జున్ వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థికి ప్రచారం చేశారు. ఇదే తరుణంలో నాగబాబు స్పందించి  అల్లు అర్జున్ కు కౌంటర్ ఇచ్చారు.  అలా వారి వివాదం ఉన్న సమయంలో ఆయన చిరంజీవికి ఎలా విషెస్ చెప్తారు అనేది అందరూ ఆసక్తిగా ఎదురు చూశారు. అల్లు అర్జున్ ఒక్కమాటలో  చిరంజీవికి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు. ప్రస్తుతం ఆయన పెట్టిన పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.

newsline-whatsapp-channel
Tags : chiranjeevi newslinetelugu allu-arjun bunny happy-birthday-chiranjeevi

Related Articles