Alluarjun:అల్లుఅర్జున్ పెళ్లికి ముందే ఆమెతో లవ్ లో పడ్డారా.?

అల్లు అర్జున్ తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఐకాన్ స్టార్ గా ఎంతో గుర్తింపు పొందారు.  పుష్ప సినిమా ద్వారా పాన్ ఇండియా స్టార్ గా మారారు. అలాంటి అల్లు అర్జున్ కు సినీ బ్యాగ్రౌండ్ ఎంత ఉన్నా కానీ, తన


Published Aug 12, 2024 08:27:25 PM
postImages/2024-08-12//1723474645_allarjunlovebeforemarriage.jpg

న్యూస్ లైన్ డెస్క్: అల్లు అర్జున్ తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఐకాన్ స్టార్ గా ఎంతో గుర్తింపు పొందారు.  పుష్ప సినిమా ద్వారా పాన్ ఇండియా స్టార్ గా మారారు. అలాంటి అల్లు అర్జున్ కు సినీ బ్యాగ్రౌండ్ ఎంత ఉన్నా కానీ, తన సొంత నటనతోనే ఎదిగారు తప్ప  తన బ్యాక్ గ్రౌండ్ ఉపయోగించుకోలేదు. అల్లు అర్జున్ సినిమా ఇండస్ట్రీలో ఎలాంటి పాత్రలో అయినా నటించే ఘనుడు. ఆయన చేసినటువంటి క్యారెక్టర్ లో ఇక ఏ హీరో కూడా చేయలేడు అని చెప్పవచ్చు. పుష్ప సినిమాలో ఆయన నటన అమోఘం. అందుకే ఆ చిత్రం పాన్ ఇండియా లెవెల్ లో బంపర్ హిట్ అయింది.

అలాంటి ఆ సినిమాకు సీక్వల్ గా  సుకుమార్ డైరెక్షన్ లో పుష్ప2 వస్తోంది.  ఇలా ఇండస్ట్రీలో స్టార్ గా దూసుకుపోతున్న అల్లు అర్జున్  సినిమాల్లో నటిస్తున్న సమయంలోనే తన తోటి కథానాయిక కేథరిన్ ను బాగా ఇష్టపడ్డారని కొన్ని వార్తలు వినిపిస్తున్నాయి.  ఆమెపై ఇష్టం ఉంది కాబట్టే వరుసగా ఆమెకు అవకాశాలు  ఇప్పించారని కొంతమంది అనుకుంటున్నారు.  వరుణ్ సందేశ్ హీరోగా వచ్చినటువంటి చమ్మక్ చంద్ర మూవీ ద్వారా మలయాళ పరిశ్రమ నుంచి మొదలు తెలుగు పరిశ్రమలోకి ఎంట్రీ ఇచ్చిన కేథరిన్, ఇద్దరమ్మాయిలతో సినిమా ద్వారా బన్నీ పక్కన రెండో హీరోయిన్ గా చేసింది.

ఆ తర్వాత నేనే రాజు నేనే మంత్రి, గౌతమ్ నంద, వదలడు, సరైనోడు లో కూడా నటించింది. అంతేకాకుండా అల్లు అర్జున్  ప్రధాన పాత్రలో వచ్చినటువంటి రుద్రమదేవి చిత్రంలో కూడా గోనగన్నారెడ్డికీ ప్రేయసిగా నటించింది. ఇలా అల్లు అర్జున్ తో మూడు సినిమాల్లో  ఈమె చేయడంతో అల్లు అర్జున్ మరియు కేథరిన్ మధ్య ఏదో నడుస్తుందని అప్పట్లో అనేక వార్తలు వినిపించాయి.  ఇక అప్పటినుంచి కేథరిన్ కు ఈయన సినిమాల్లో ఆఫర్లు ఇవ్వడం మానేశారు.

newsline-whatsapp-channel
Tags : news-line allu-arjun catherion rudramadevi eddarammailatho

Related Articles