amir Khan: మూడో పెళ్లిపై ఆమిర్ ఖాన్ ..సింగిల్ గా ఉండడం నా వల్ల కాదు!

రీనా దత్తా, కిరణ్ రావుతో మంచి అనుబంధం ఉంది. అది అందరికీ తెలుసు. వాళ్లు కూడా కుటుంబమే కాని పెళ్లికి కలిసి ఉండడానికి మాత్రం మనసుకు నచ్చిన తోడు మాత్రం ఉండాలని అన్నారు.


Published Aug 27, 2024 11:36:24 AM
postImages/2024-08-27/1724748568_6050a3ad40f08.jpg

న్యూస్ లైన్, స్పెషల్ డెస్క్:  బాలీవుడ్ మిస్టర్ పర్ఫెక్ట్ అమీర్ ఖాన్ పెళ్లిపై చాలా ఇంట్రస్టింగ్ కామెంట్లు చేశారు. విడాకులు తీసుకున్నాం. మాజీ భార్య రీనా దత్తా, కిరణ్ రావుతో మంచి అనుబంధం ఉంది. అది అందరికీ తెలుసు. వాళ్లు కూడా కుటుంబమే కాని పెళ్లికి కలిసి ఉండడానికి మాత్రం మనసుకు నచ్చిన తోడు మాత్రం ఉండాలని అన్నారు.


త‌న‌కు ఒంట‌రిగా జీవించ‌డం ఇష్ట‌ముండ‌ద‌ని చెప్పిన ఆమిర్‌.. త‌న‌కు ఒక భాగ‌స్వామి ఉండాల‌ని కోరుకుంటాన‌ని చెప్పారు. వయసు ఏదైనా కాని సింగిల్ గా ఉండడం చాలా కష్టం. తోడు లేని జీవితాన్ని ఊహించలేము. జీవితంలో ఏది మనం అనుకున్నట్లు జరగదు. అలా అని ముందే భయపడి పెళ్లి మానేస్తే ఎలా...పెళ్లి చేసుకోవాలి..తర్వాత ఆ బంధం నిలబడుతుందా లేదా అనేది దేవుని దయ అని అన్నారు.


మూడో పెళ్లి  '59 ఏళ్ల వ‌య‌సులో వివాహం అంటే క‌ష్టం. నాకు ఎన్నో బాధ్య‌త‌లు ఉన్నాయి. ప్ర‌స్తుతం నాకెంతో ఇష్ట‌మైన వారితో సంతోషంగా స‌మయాన్ని ఆస్వాదిస్తున్నా. నా ఫ్యామిలీ, పిల్ల‌లు, మిత్రుల‌తో రీ క‌నెక్ట్ అయ్యా' అని ఆమిర్ ఖాన్‌ చెప్పుకొచ్చారు. 1986లో మొద‌ట రీనాద‌త్తాను ల‌వ్‌మ్యారేజ్ చేసుకున్నారు. ఈ జంట 2002లో వీడిపోయింది. ఆ త‌ర్వాత ల‌గాన్ మూవీకి అసిస్టెంట్ డైరెక్ట‌ర్‌గా ప‌నిచేసిన కిర‌ణ్‌రావుతో ఆమిర్‌కు ప‌రిచ‌యం ఏర్ప‌డింది. ఆ ప‌రిచ‌యం కాస్తా త‌ర్వాత ప్రేమ‌గా మారి 2005లో వివాహ బంధంలోకి అడుగుపెట్టారు. అయితే, అనూహ్యంగా 2021లో 16 ఏళ్ల వైవాహిక బంధానికి గుడ్ బై చెప్పేశారు. ఇప్పుడు మూడో పెళ్లికి రెడీ అవుతున్నాడని బాలీవుడ్ టాక్.

newsline-whatsapp-channel
Tags : newslinetelugu movie-news wedding bollywood

Related Articles