తెలంగాణ రాష్ట్రాల్లో భారీ వర్షాల కారణంగా నష్టపోయిన బాధితులకు ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, నటుడు పవన్ కల్యాణ్ భారీ విరాళాన్ని ప్రకటించారు.
న్యూస్ లైన్ డెస్క్: తెలంగాణ రాష్ట్రాల్లో భారీ వర్షాల కారణంగా నష్టపోయిన బాధితులకు ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, నటుడు పవన్ కల్యాణ్ భారీ విరాళాన్ని ప్రకటించారు. తెలంగాణకు 1 కోటి రూపాయలను ముఖ్యమంత్రి సహాయ నిధికి అందజేస్తానని బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఇక ఏపీలో వరద సహాయ చర్యల కోసం 400 పంచాయతీలకు పవన్ కళ్యాణ్ 6 కోట్లు విరాళంగా అందించారు. ఇక పంచాయితీ రాజ్ మంత్రిత్వ శాఖ ఉద్యోగులు కూడా తమ ఒకరోజు జీతం నుంచి రూ. 14 కోట్లు ఏపీ సీఎం సహాయ నిధికి విరాళంగా ఇచ్చారు. ఇప్పటీకే పవన్ కళ్యాణ్ ఏపీకి రూ. కోటి విరాళాన్ని ప్రకటించిన విషయం తెలిసిందే.
ఇక సినీ పరిశ్రమ నుంచి జూనియర్ ఎన్టీఆర్, మహేష్ బాబు రెండు రాష్ట్రాల సీఎం సహాయనిధికి చెరో రూ. 50 లక్షల చొప్పున రూ.కోటి. ఇక విశ్వక్ సేన్ రూ. 5 లక్షల చొప్పున రూ. 10 లక్షలు, సిధ్ధూ జొన్నలగడ్డ రూ.15 లక్షల చొప్పున రూ. 30 లక్షలు. త్రివిక్రమ్, రాధాకృష్ణ, నాగవంశీ రెండు రాష్ట్రాలకు రూ.25 లక్షల చొప్పున రూ.50 లక్షలు, దర్శకుడు వెంకీ అట్లూరి రూ. 5 లక్షల చొప్పున రూ.10 లక్షలు, నందమూరి బాలకృష్ణ రూ.50 లక్షల చొప్పు రూ.కోటి విరాళం ప్రకటించారు.