న్యూస్ లైన్ డెస్క్ : పుష్ప మూవీతో అల్లు అర్జున్ దేశవ్యాప్తంగా ఎంత క్రేజ్ తెచ్చుకున్నారో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. పుష్ప-1 సూపర్ హిట్ తర్వాత త్వరలోనే పుష్ప-2 ప్రేక్షకుల ముందుకు తెచ్చేందుకు సుకుమార్, బన్నీ రెడీ అయిపోయారు. అయితే.. మొన్న జరిగిన ఏపీ ఎన్నికల్లో అల్లు అర్జున్ తన మామ పవన్ కల్యాణ్ సపోర్ట్ చేస్తున్న కూటమికి కాకుండా.. అధికార పక్షమైన వైఎస్సార్సీపీ అభ్యర్థికి మద్దతుగా ప్రచారం చేశారు. దీంతో మెగా, అల్లు కుటుంబాల మధ్య కోల్డ్ వార్ నడుస్తోంది. ఈ నేపథ్యంలోనే మొన్నటికి మొన్న పుష్ప సినిమాను ఉద్ధేశించి ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ఘాటు విమర్శలే చేశారు.
అయితే ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు ఇప్పుడు రియల్ పుష్పరాజ్ లపై కొరడా ఝుళిపించేందుకు సిద్ధమయ్యారు.ఏపీలో పేట్రేగిపోతున్న ఎర్రచందనం స్మగ్లర్లపై కఠిన చర్యలు తీసుకుంటామంటూ ప్రకటిచారు. అడవుల్లో అడుగు పెడితే.. అదే చివరి రోజు అవుతుందంటూ స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు. డ్రోన్లతో వెంటాడుతామని.. ఎర్ర చందనం నరుకుతూ.. తరలిస్తూ కనిపిస్తే అదే చివరి సారి కనిపించడం అవుతుందని వార్నింగ్ ఇచ్చారు. ఇది చూసిన నెటిజనులు డిప్యూటీ సీఎం రీల్ పుష్ఫరాజ్ కి వార్నింగ్ ఇస్తే.. సీఎం రియల్ పుష్పరాజ్ కి వార్నింగ్ ఇచ్చారంటూ పోస్టులు పెడుతున్నారు.