Venuswamy : నాగచైతన్య.. శోభిత బంధంపై బాంబేసిన వేణుస్వామి.. ఏమన్నాడంటే..

ఒక్కటైన నాగచైతన్య, ధూళిపాళ్ల శోభితల ఎంగేజ్ మెంట్ మీద వేణుస్వామి సెన్షేషనల్ కామెంట్స్ చేశాడు.


Published Aug 09, 2024 03:50:03 AM
postImages/2024-08-09/1723191110_VenuSwamy.jpg

న్యూస్ లైన్ డెస్క్ : నిత్యం వార్తల్లో ఉండటం.. ఏ బాంబ్ వేస్తే ట్రెండింగ్ లో ఉంటామో ప్రముఖ జ్యోతిష్యుడు వేణుస్వామికి వెన్నతో పెట్టిన విద్యలా కనిపిస్తుంది. తాజాగా ఒక్కటైన నాగచైతన్య, ధూళిపాళ్ల శోభితల ఎంగేజ్ మెంట్ మీద వేణుస్వామి సెన్షేషనల్ కామెంట్స్ చేశాడు. గతంలో నాగచైతన్య, సమంతాల విడాకులపై ఆయన చేసిన కామెంట్స్ సైతం సోషల్ మీడియాలో, టాలీవుడ్ లో హాట్ టాపిక్ గా మారాయి. కాగా.. తాజాగా నాగచైతన్య, శోభితల జంటపై వేణుస్వామి మరోసారి బాంబు పేల్చాడు.

సోషల్ మీడియా వేదికగా నాగచైతన్య, ధూళిపాళ్ల శోభితల ఎంగేజ్ మెంట్ జరిగింది అని నాగార్జున పోస్ట్ చేసిన విషయం తెలిసిందే. ఆ వెంటనే వారి జాతకం గురించి రేపు చెప్తా అంటూ వేణుస్వామి సోషల్ మీడియాలో ప్రకటించాడు. మొన్నటి ఎన్నికల ఫలితం తలకిందులైన తర్వాత ఇకపై జాతకం చెప్పను అని బహిరంగంగానే చెప్పిన వేణుస్వామి తాజాగా నాగచైతన్య ఇష్యూపై స్పందించాడు. శుభమా అని ఇద్దరూ పెళ్లి చేసుకుంటుంటే ఈయన మళ్లీ వచ్చాడేమిటి అనుకునేవాళ్లు కొందరైతే.. ఈయన చెప్పాడంటే అంతే అంటూ మరికొందరు సోషల్ మీడియాలో కామెంట్ చేస్తున్నారు.

ఇంతకీ వేణుస్వామి ఏం చెప్పాడంటే..

  • చైతన్య – శోభితల జాతకాల ప్రకారం వీరి బంధం మూడేళ్లు మాత్రమే ఉంటుంది. ఆ తర్వాత కష్టమే..
  • నిశ్చితార్థం ముహుర్తం 8.8.8 అనేది సంఖ్యాశాస్త్రం ప్రకారం ఓకే కానీ.. ఆ ముహుర్తంలో గ్రహస్థితి సరిగ్గా లేదు.
  • సమంతాతో పోలిస్తే శోభిత పర్సనల్ కెరీర్ చాలా బలహీనంగా ఉంది.
  • చైతూ, సమంతాల జాతకానికి 50 మార్కులు వేస్తే.. చైతూ, శోభితల జాతకాలకు 10 మార్కులే వేస్తా
  • ఒక స్త్రీ కారణంగా వీరిద్దరి సంసారంలో ఒడిదుడుకులు వస్తాయి.
  • ఇదంతా జాతకపరంగా చెప్పిందే కానీ. వారిద్దరూ విడిపోవాలని.. విడిపోతారని కాదు. వారిద్దరూ బాగుండాలని, కలిసే ఉండాలని కోరుకుంటున్నాను. పెళ్లికి ముందే కొన్ని రిలీఫ్ మెథడ్స్ ఫాలో అయితే బెటర్. జాతకంలో అలా జరగాలని రాసి ఉంటే గనక ఏ ఉపశమన పూజలు ఫలించవు.

 

newsline-whatsapp-channel
Tags : nagarjuna movie-news divorce samantha nagachaitanya venuswamy shobanbabu latest-news graydivorce

Related Articles