Big boss8:14 మంది కంటెస్టెంట్లు..7 జంటలు.. వారి బ్యాగ్రౌండ్ ఇదే.?

బిగ్ బాస్ సీజన్ 8 ఎంతో అట్టహాసంగా ప్రారంభమైంది. మొత్తం 14 మంది ఎనర్జీ ఉన్న కంటెస్టెంట్లు హౌస్ లోకి ఎంట్రీ ఇచ్చారు. వారందరినీ హోస్ట్ నాగార్జున సాధారంగా ఆహ్వానం పలికారు.  14 మందిని


Published Sep 02, 2024 11:22:53 AM
postImages/2024-09-02/1725256373_nagarjuna.jpg

న్యూస్ లైన్ డెస్క్: బిగ్ బాస్ సీజన్ 8 ఎంతో అట్టహాసంగా ప్రారంభమైంది. మొత్తం 14 మంది ఎనర్జీ ఉన్న కంటెస్టెంట్లు హౌస్ లోకి ఎంట్రీ ఇచ్చారు. వారందరినీ హోస్ట్ నాగార్జున సాధారంగా ఆహ్వానం పలికారు.  14 మందిని ఇద్దరు చొప్పున జంటలుగా చేసి హౌస్ లోకి పంపారు. అంతేకాదు ఈసారి బిగ్ బాస్ చాలా లిమిట్స్ లో ఉంటుందని ముందు నుంచే చెప్పుకుంటూ వచ్చారు. అయితే హౌస్ లోకి ఎంట్రీ ఇచ్చిన వారందరికీ మూడు కండిషన్లను కూడా పెట్టారు నాగార్జున.  ఆయన పెట్టిన కండిషన్స్ ప్రకారం బిగ్ బాస్ హౌస్ లో కెప్టెన్సీ అనేది ఉండదు.

అంతేకాదు అంతకుముందులా రేషన్ కూడా హౌస్ లో ఉన్న వారికి ఇవ్వరు. వాళ్లే కష్టపడి సంపాదించుకోవాలి. అలాగే ప్రైజ్ మనీ కూడా జీరో అంటూ ఆయన చెప్పుకొచ్చారు. వారి యొక్క పర్ఫామెన్స్ ను బట్టి ప్రైజ్ మనీ లిమిట్ లెస్ గా మారుతుంది అన్నమాట. ఎన్ని కండిషన్లకు ఓకే చెప్పిన తర్వాతే బిగ్ బాస్ హౌస్ లోకి కంటెస్టెంట్లు ఎంట్రీ ఇచ్చారు. ఆ కంటెస్టెంట్లు ఎవరు వారి యొక్క వివరాలు చూద్దాం.

#1. యశ్మీ:
బిగ్బాస్ సీజన్ 8 లో మొదటిసారి హౌస్ లోకి అడుగుపెట్టిన కంటెస్టెంట్ యష్మి.ఈమె సీరియల్స్ ద్వారా ఎంతో పేరు తెచ్చుకుంది.  అలాంటి ఈమె హౌస్ లోకి ఎంట్రీ ఇచ్చేముందు నాగార్జున తో మాట్లాడుతూ ఆసక్తికరమైన కామెంట్స్ చేసింది. నాకు బాయ్ ఫ్రెండ్స్ లేరు. ఒకప్పుడు ఉండేవాడు కానీ నన్ను భరించలేక  నేనే పంపించా. పెళ్లిపై కూడా ఇలాంటి అభిప్రాయం లేదు మొదట రిలేషన్షిప్ ఓకే అయిన తర్వాత పెళ్లి చేసుకుంటా పెద్దలు కుదిర్చిన పెళ్లి చేసుకోను. నాకు బిర్యానీ అంటే చాలా ఇష్టం అది లేకుండా ఉండలేను. నాకు హౌస్ లో  పోటీ మాత్రం ఇస్తానని అనుకుంటున్నాను అని చెప్పుకొచ్చింది. 

#2. నిఖిల్ :
 కన్నడ ఇండస్ట్రీలో హీరోగా చేశారు నిఖిల్. డాన్సర్ అవుదామని అనుకున్న నిఖిల్ అనుకోకుండా హీరో అయ్యాడు. అయితే నేను బిగ్ బాస్ హౌస్ లో ఒక బాధ్యత కలిగిన వ్యక్తిగా ఉండాలని అనుకుంటున్నా. ప్రస్తుతం నాకు పెళ్లి కాలేదు. కాబట్టి లవ్ స్టోరీలు లాంటిది హౌస్ లో ఏం పెట్టుకోను. మా అమ్మ వాళ్లు చూసిన సంబంధమే నేను ఫైనల్ చేసుకుంటాను హౌస్ లో మనశ్శాంతి కావాలనుకుంటున్నాను కానీ అక్కడ దొరకదు.

#3. అభయ్ నవీన్:
 డైరెక్టర్ గా నటుడిగా ఈయన మనందరికీ తెలుసు. పెళ్లిచూపులు అనే సినిమా ద్వారా మంచి గుర్తింపు సాధించాడు. అన్నపూర్ణ స్టూడియోలో నిర్వహించిన యాక్టింగ్ స్కూల్లో మొదటి బ్యాచ్ నేను.  నటుడిగా చాలా సినిమాల్లో చేశాను కానీ నచ్చలేదు దర్శకత్వం చేయాలనిపించి రామన్న యూత్ అనే చిత్రం చేశా.ఇంతలో బిగ్ బాస్ అవకాశం వచ్చింది. 

#4. ప్రేరణ:
  కన్నడ ఇండస్ట్రీలో రంగనాయకి అనే టీవీ షో ద్వారా సినిమా ఇండస్ట్రీ లోకి ఎంట్రీ ఇచ్చింది ప్రేరణ. పలు సినిమాల్లో సీరియల్స్ లో కూడా నటిస్తోంది. అలాంటి ప్రేరణ బిగ్ బాస్ లోకి ఎంట్రీ ఇచ్చి..నేనెప్పుడూ సంతోషంగా ఉండాలనుకుంటున్నాను, అలాగే ఉంటాను. నేను ఆటలు బాగా ఆడతాను నాతో పోటీ పడే కంటెస్టెంట్ లో పరిస్థితి ఏంటో అర్థం కావడం లేదు.నేను రష్మిక మందన మంచి స్నేహితుల అర్ధరాత్రి కూడా స్కూటీ వేసుకుని తిరిగే రోజులు  ఉన్నాయి. నాకు వివాహమై 8 నెలలు అయిపోయింది. మా ఆయన పేరు శ్రీ పాద్. నాకు హౌస్ లో లిమిట్ లెస్ గా నిద్ర కావాలంటూ అభయ్ నవీన్ తో కలిసి అదుపులోకి వెళ్ళింది. 

#5: ఆదిత్య ఓం:
 లాహిరి లాహిరి లాహిరిలో అనే చిత్రం ద్వారా తెలుగు ప్రేక్షకులకు పరిచయమయ్యాను. అప్పట్లో నేను చేసిన సినిమాలు ఫ్లాప్ అవడంతో ఇంట్లో నుంచి బయటకు రావాలనిపించలేదు. ఇక 2010లో మళ్ళీ కెరియర్ బాలీవుడ్ లో 4 హిందీ చిత్రాలకు దర్శకత్వం చేశా . అనేక అవార్డులు కూడా వచ్చాయి. బిగ్బాస్ అనేది చాలెంజ్ నా కెరియర్లో మళ్ళీ పుట్టేందుకు బిగ్బాస్ వస్తున్న అని చెప్పారు. ఈ హౌస్ లో నాకు లిమిట్ లెస్ గా ఛాలెంజజెస్ కావాలని అన్నారు. 

#6. సోనియా:
 రాంగోపాల్ వర్మ డైరెక్షన్ చేసిన దిశా అనే మూవీలో ఈమె నటిగా గుర్తింపు తెచ్చుకుంది. బిగ్బాస్ హౌస్ అనేది మంచి ప్లాట్ ఫామ్ ఇది ఎన్ని కోట్లు కొంతమందికి ఇందులోకి రావాలనుకున్న కుదరదు. హౌస్ లో లిమిట్ లెస్ గా స్నేహితులను పెంచుకోవాలనుకుంటున్న కరాటే, కలారి నాకు వచ్చు. ఇప్పటికి నా చేతిలో చాలామంది దెబ్బలు తిన్నారు అంటూ చెప్పుకొచ్చింది. 

#7. బెజవాడ బేబక్క:
 సోషల్ మీడియా ద్వారా ఎంతో పేరు తెచ్చుకుంది బెజవాడ బేబక్క.ఈమె అసలు పేరు మధు. కానీ సోషల్ మీడియాలో బెజవాడ బేబక్క అంటూ పేరు. అలాంటి ఈమె విజయవాడ గుంటూరు తిరిగినట్టు అమెరికా తరచూ వెళ్తూ అక్కడ ఏదైనా కార్యక్రమాలు జరిగితే యాంకర్ గా,  గాయనిగా చేస్తానని చెప్పుకొచ్చింది. 

#8.శేఖర్ భాష:
  రేడియో జాకీగా శేఖర్ భాష అందరికీ పరిచయమే. ఈ సీజన్లో అసలైన శేఖర్ భాషను మీరు చూడబోతున్నారని చెప్పారు. ఇంతకుముందు అందరిని పిలిచేవారు నన్ను ఎందుకు పిలవరని అనుకునేవాన్ని. కానీ నాకు చాన్స్ వచ్చింది. హౌస్ లో నన్ను ఫ్రెండ్స్ గా చూస్తే పర్వాలేదు శత్రువుగా చూస్తే బిగ్ బాస్ టైటిల్ ఎగరేస్కపోతా.

#9. కిరాక్ సీత:
బేబీ మూవీ ద్వారా ప్రేక్షకులకు పరిచయమైంది కిరాక్ సీత. ఈమె హౌస్ లో మాట్లాడుతూ బేబీ సినిమాలో నా నటన చూసి చాలామంది తిట్టారు. కానీ నటిగా నేను సంతోషంగా ఫీలయ్యా.. అయితే వ్యక్తిగతంగా నన్ను అవమానించారు..ముందు ఒకలా వెనుక మరొకలా ఉండే వాళ్లంటే నాకు చాలా చిరాకు. కెమెరా ముందు నటించాలి కానీ వెనక అస్సలు నటించకూడదు.నన్ను నేను ఇంకా నిరూపించుకునేందుకు లిమిట్ లెస్ గా అవకాశాలు కావాలని కోరుకున్న సమయంలో బిగ్ బాస్ లోకి వచ్చారని చెప్పింది. 

#10. నాగ మణికంఠ:
 ఈయన చిన్నతనంలోనే అమ్మానాన్నలను కోల్పోయాడు. ఆ తర్వాత కాస్త ఎదిగి పెళ్లి చేసుకున్న తర్వాత భార్య కూడా దూరం పెట్టింది. తాను గౌరవాన్ని ఎక్కడైతే అక్కడే మళ్ళీ సంపాదించుకోవాలని సామాన్యుడిగా సీజన్ 8 లో అడుగు పెట్టారు నాగమణికంఠ. 

#11. పృథ్విరాజ్:
కన్నడ సీరియల్స్ లో ఎంతో గుర్తింపు తెచ్చుకున్నారు పృథ్వీరాజ్. బిగ్బాస్ అనేది మంచి ఫ్లాట్ ఫామ్ అని, ఇక్కడికి రావడానికి ఎంతో కాలం నుంచి ట్రై చేస్తున్నానని ఈసారి వచ్చానని, ప్రేక్షకుల ప్రేమ నాకు లిమిట్ లెస్ గా కావాలని ఆయన చెప్పుకొచ్చారు. 

#12. విష్ణు ప్రియ:
 తెలుగు ఇండస్ట్రీలో యాంకర్ గా ఎంతో గుర్తింపు పొందింది విష్ణు ప్రియ.తనకు బిగ్ బాస్ సీజన్ 8లో లిమిట్ లెస్ గా ఎంటర్టైన్మెంట్ కావాలని కోరుకుంటుంది. 

#13. నైనిక:
బుల్లితెర షోలలో ఢీ షో ఎంత ఆదరణ పొందిందో మనందరికీ తెలుసు. ఇందులో నైనిక అలరించారు. మొత్తం బిగ్ బాస్ లో అవకాశం రావడం నా జీవితంలో ఒక ముందడుగు అని చెప్పుకొచ్చారు. డాన్సర్ నువ్వు కాకపోతే నటిని అయ్యే దాన్ని, అమ్మకు కూడా నేను నటించడం అంటేనే ఇష్టం అని చెప్పుకొచ్చింది. 

#14. నబిల్ అఫ్రిది.
 వరంగల్ డైరీస్ అనే యూట్యూబ్ ఛానల్ ద్వారా యువతలో ఎంతో క్రేజ్ సంపాదించుకున్నారు ఆఫ్రిది. సోషల్ మీడియాలో ఎంతో ఫేమస్ అయిన నాకు బిగ్ బాస్ లో అవకాశం రావడం తన కళ అని చెప్పుకొచ్చారు.
 

newsline-whatsapp-channel
Tags : newslinetelugu nagarjuna big-boos8 vishnu-priya nainika bejavada-bebakka pruthiraj

Related Articles