Bigg Boss 8: ఒక్కసారి కమిట్ అయితే లిమిట్ లేదు.. బిగ్ బాస్ ప్రోమో

మోస్ట్ అవైటెడ్ రియాలిటీ షో బిగ్ బాస్ సీజన్ 8 మరి కొన్ని రోజులో ప్రారంభం కానుంది.


Published Aug 11, 2024 07:43:22 AM
postImages/2024-08-11/1723379679_biggboss.PNG

న్యూస్ లైన్ సినిమా: మోస్ట్ అవైటెడ్ రియాలిటీ షో బిగ్ బాస్ సీజన్ 8 మరి కొన్ని రోజులో ప్రారంభం కానుంది. అయితే బిగ్ బాస్ అభిమానులకు బిగ్ బాస్ యాజమన్యం సాలిగ్ అప్‌డేట్ ఇచ్చింది. ఆదివారం ఒక్కసారి కమిట్ అయితే లిమిట్ లేదు.. అంటూ బిగ్ బాస్ నయా ప్రోమోను విడుదల చేసింది. ఈ ప్రోమోలో హీరో నాగార్జున, కమెడియన్ సత్య మధ్య జరిగిన సంభాషణ ఈ కార్యక్రమం పై మరిన్ని అంచనాలను పెంచేసింది. నాగార్జున ఒక్కసారి కమిట్ అయితే లిమిట్ లేదు డైలాంగ్‌ చెప్పగా నాకు అన్ని ఆన్‌ లిమిటెడ్‌గా కావాలి అంటూ అరుస్తాడు.. ఇక దేకో దేకో మస్తు ఆటే బిగ్ బాస్ సాంగ్‌‌లో నాగ్ అమ్మాయిలతో డాన్స్, రొమాన్స్ చేస్తాడు.

రిచ్ పీపుల్‌కు ప్రయివసి లేదా అంటూ సత్య అనగా.. నీకు ఇంక ఏం కావాలి ఇక్కడ ఒక్కసారి కమిట్ అయితే లిమిట్ లేదు అని నాగ్ చెప్పగా.. సత్య ఎడారిలో కనిపిస్తాడు. ప్రోమో చివరిలో నాగ్ ఈ సారి బిగ్ బాస్ సీజన్ 8లో ఫన్, ఎంటైన్మెంట్, ట్విస్ట్‌లకు కొదవేలేదు అంటూ డైలాగ్‌తో ఎండ్ అవుతుంది. అయితే నాగార్జున ఈ సీజన్‌లో లిమిట్ ఉండదు అన్ లిమిటెడ్‌గా ఇస్తానని చెప్పడం చూస్తుంటే సీజన్‌లో మరింత రెట్టింపు వినోదం ఉండబోతుందని స్పష్టంగా తెలుస్తోంది. ప్రస్తుతం ఈ ప్రోమో సోషల్ మీడియాలో నెట్టింట వైరల్‌గా మారింది.

newsline-whatsapp-channel
Tags : nagarjuna tollywood big-boos8 cinema-news

Related Articles