దమ్ముంటే ఆ పని చేయండి.. కాంగ్రెస్ కు బీఎల్ సంతోష్ గట్టి కౌంటర్

మీనాక్షి నటరాజన్ కేసు గురించి బయటపెట్టిన తెలంగాణ కాంగ్రెస్ కోవర్ట్ ఎవరు అంటూ బీజేపీ సీనియర్ నేత బీఎల్‌ సంతోష్‌ ప్రశ్నించారు. కాంగ్రెస్ కోవర్ట్‌ ను పట్టుకోకుండా బీజేపీ మీద అరుపులు ఎందుకని, ముందు కాంగ్రెస్‌లోని కోవర్టులను పట్టుకుని అదుపులో పెట్టుకోవాలంటూ బీఎల్ సంతోష్ కుమార్ ట్వీట్ చేశారు.


Published Jun 10, 2026 02:12:58 PM
postImages/2026-06-10/1781080978_93436b20d31247759cc5f3041ce7388c.jfif

మధ్యప్రదేశ్ లో తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ వ్యవహారాల ఇంచార్జీ మీనాక్షి నటరాజన్ నామినేషన్ తిరస్కరణతో ఇప్పుడు కాంగ్రెస్ పార్టీలో పెద్ద డైలామాలో పడింది. తెలంగాణ కాంగ్రెస్ పార్టీకి చెందిన వాళ్లే మీనాక్షి నటరాజన్ పై ఉన్న క్రిమినల్ కేసు విషయాలను లీకులు ఇచ్చారంటూ మధ్యప్రదేశ్ కు చెందిన బీజేపీ మంత్రి కైలాష్ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు కాంగ్రెస్ పార్టీలో సంచలనంగా మారాయి. దీనిపై ఇప్పటికే కాంగ్రెస్ అధిష్టానం ఆరా తీయడం మొదలుపెట్టింది. దీనికి తోడు ఇప్పుడు బీజేపీ సీనియర్ నేత బీఎల్ సంతోష్ చేసిన ట్వీట్ తో మరింత హాట్ టాఫిక్ గామారింది.

మీనాక్షి నటరాజన్ కేసు గురించి బయటపెట్టిన తెలంగాణ కాంగ్రెస్ కోవర్ట్ ఎవరు అంటూ బీజేపీ సీనియర్ నేత బీఎల్‌ సంతోష్‌ ప్రశ్నించారు. కాంగ్రెస్ కోవర్ట్‌ ను పట్టుకోకుండా బీజేపీ మీద అరుపులు ఎందుకని, ముందు కాంగ్రెస్‌లోని కోవర్టులను పట్టుకుని అదుపులో పెట్టుకోవాలంటూ బీఎల్ సంతోష్ కుమార్ ట్వీట్ చేశారు. సొంత పార్టీలోనే నేతలను కంట్రోల్ లో పెట్టుకోలేని వాళ్లు బీజేపీపై ఎందుకు మాట్లాడుతున్నారంటూ చేయడంపై పార్టీ పరువు మరింత పోయిందన్న చర్చ జరుగుతోంది.

newsline-whatsapp-channel
Tags : congress bjp raja-saab meenakshi-natarajan bl-santhosh -rajya-sabha-nomination rejection-of-rajya-sabha-nomination

Related Articles