Hyderabad: పోలీస్ స్టేషన్‌కు BRS నేతలు

అరెస్ట్ విషయం తెలుసుకొని BRS నాయకులు ఎమ్మెల్యే జగదీశ్ రెడ్డి, పార్టీ నేతలు పెద్ది సుదర్శన్ రెడ్డి, దాసోజు శ్రవణ్, ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్, కార్తీక్ రెడ్డి, పలువురు పార్టీ సీనియర్ నేతలు స్టేషన్‌కు చేరుకున్నారు. 


Published Sep 05, 2024 05:58:08 PM
postImages/2024-09-05/1725539288_BRSleadersinps.jpg

న్యూస్ లైన్ డెస్క్: గురువారం సాయంత్రం BRS నేతల బృందం బషీర్ బాగ్‌లోని సీసీఎస్ పోలీస్ స్టేషన్‌కు వెళ్లింది. తెలంగాణ డిజిటల్ మీడియా మాజీ డైరెక్టర్ దిలీప్ కొణతంను ఈరోజు పోలీసులు అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. అరెస్ట్ విషయం తెలుసుకొని BRS నాయకులు ఎమ్మెల్యే జగదీశ్ రెడ్డి, పార్టీ నేతలు పెద్ది సుదర్శన్ రెడ్డి, దాసోజు శ్రవణ్, ఆర్ఎస్.ప్రవీణ్ కుమార్, కార్తీక్ రెడ్డి, పలువురు పార్టీ సీనియర్ నేతలు స్టేషన్‌కు చేరుకున్నారు. 

దిలీప్ కొణతంను కలవడానికి BRS నాయకులు ప్రయత్నించగా.. పోలీసులు అడ్డుకున్నారు. వీడియోలు తియ్యనివ్వకుండా ఫోన్లను లాగేసుకున్నారు. ప్రశ్నిస్తే అక్రమ అరెస్టులు చేస్తున్నారని BRS నేతలు ఆగ్రహం వ్యక్తం చేశారు.

newsline-whatsapp-channel
Tags : telangana ts-news news-line newslinetelugu brs telanganam jagadish-reddy kpvivekgoud brsmla enugula-rakesh-reddy rspraveenkumar

Related Articles