బీఆర్ఎస్ పార్టీ గెలిచి ఉంటే నేను హోమ్ మంత్రి ఐతుండే అని ఎమ్మెల్యే మల్లారెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు
న్యూ:స్ లైన్ డెస్క్: బీఆర్ఎస్ పార్టీ గెలిచి ఉంటే నేను హోమ్ మంత్రి ఐతుండే అని ఎమ్మెల్యే మల్లారెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. మంగళవారం ఆయన మీడియాతో చిట్ చాట్ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బీఆర్ఎస్ గెలిస్తే నేను హోమ్ మంత్రి ఐతుండే అని, సినిమాలు తీస్తుండే.. టీవి ఛానెల్ పెడ్తుండే అని ఆయన అన్నారు. బీఆర్ఎస్ మూడో సారి అధికారంలోకి వస్తే రాష్ట్రంలో తన ప్లేస్ వేరే లెవెల్ ఉంటుండే అని ఆయన అన్నారు. కాంగ్రెస్ పార్టీ అబద్దాల హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చిందని విమర్శించారు. ప్రభుత్వం వచ్చి 8 నెలలు అవుతున్నా ఇప్పటి వరకు ఆరు గ్యారెంటీలు అమలు చేయలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. బీఆర్‌ఎస్ మళ్లీ అధికారంలోకి వస్తుందని, కేసీఆర్ ముఖ్యమంత్రి అవుతారు అని మల్లారెడ్డి ధీమా వ్యక్తం చేశారు.