Video: బీఆర్ఎస్ ఎమ్మెల్యే అరెస్ట్

కాంగ్రెస్ ప్రభుత్వం తమ డిమాండ్లను నెరవేర్చాలని రాష్ట్ర వ్యాప్తంగా నిరుద్యోగులు ఆందోళన తెలుపుతున్న విషయం తెలిసిందే. అధికారంలోకి వచ్చేందుకు అసెంబ్లీ ఎన్నికల సమయంలో కాంగ్రెస్ నాయకులు ఇచ్చిన హామీలను అమలు చేయాలని డిమాండ్ చేస్తూ నిరుద్యోగులతో పాటు విద్యార్థి సంఘాల నాయకులు కూడా నిరసనలు తెలుపుతున్నారు.  


Published Jul 01, 2024 03:59:54 AM
postImages/2024-07-01/1719823449_modi11.jpg

న్యూస్ లైన్ డెస్క్: బీఆర్ఎస్ ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్ రెడ్డి(Palla Rajeswar reddy) అరెస్ట్ అయ్యారు. నిరుద్యోగుల డిమాండ్ల సాధన కోసం గాంధీ ఆసుపత్రి(Gandhi hospital)లో విద్యార్థి నాయకుడు మోతీలాల్ నాయక్‌(Motilal Nayak) ఆమరణ నిరాహార దీక్ష చేస్తున్న విషయం తెలిసిందే. సోమవారం ఆయనను పరామర్శించేందుకు గాంధీ హాస్పిటల్ వద్దకు వెల్లిన రాజేశ్వర్ రెడ్డిని పోలీసులు అరెస్ట్ చేశారు. 

ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడిన ఆయన పోలీసుల జులుం నశించాలని అన్నారు. విద్యార్థి నాయకుడిని పరామర్శించేందుకు వచ్చినందుకు తనను దౌర్జన్యంగా పోలీసులు అరెస్ట్ చేస్తున్నారని అన్నారు.

 

కాగా, కాంగ్రెస్ ప్రభుత్వం తమ డిమాండ్లను నెరవేర్చాలని రాష్ట్ర వ్యాప్తంగా నిరుద్యోగులు ఆందోళన తెలుపుతున్న విషయం తెలిసిందే. అధికారంలోకి వచ్చేందుకు అసెంబ్లీ ఎన్నికల సమయంలో కాంగ్రెస్ నాయకులు ఇచ్చిన హామీలను అమలు చేయాలని డిమాండ్ చేస్తూ నిరుద్యోగులతో పాటు విద్యార్థి సంఘాల నాయకులు కూడా నిరసనలు తెలుపుతున్నారు.

newsline-whatsapp-channel
Tags : telangana newslinetelugu brs congress unemployed, telanganam congress-government telangana-government gandhi-hospital telangana-bandh palla-rajeswar-reddy arrest

Related Articles