గన్‌పార్క్ వద్ద బీఆర్‌ఎస్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు ఆందోళన చేపట్టారు.
న్యూస్ లైన్ డెస్క్: గన్‌పార్క్‌లోని తెలంగాణ అమరవీరుల స్థూపం వద్ద బీఆర్‌ఎస్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు ఆందోళన చేపట్టారు. అసెంబ్లీలో జాబ్ క్యాలెండర్ ప్రకటిస్తామని చెప్పిన ముఖ్యమంత్రి రేంవత్ రెడ్డి.. నేడు ఉద్యోగాల సంఖ్య ప్రకటించకపోవడంతో శుక్రవారం గన్‌పార్క్ వద్ద పెద్ద ఎత్తున్న నిరసన తెలిపారు. కాంగ్రెస్ ప్రభుత్వం నిండు సభలో నిరుద్యోగులను మోసం చేసిందని ఆరోపించారు. తానాషాహీ నహీ చలేగా.. సీఎం డౌన్ డౌన్ అంటూ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీల నినాదాలు చేశారు.