Fake Court: వార్నీ..ఏకంగా ఫేక్ కోర్టునే నడుపుతున్న గుజరాత్ వ్యక్తి !

ఓ ప్రభుత్వ భూమికి సంబంధించిన కేసులో తన కంప్లయింట్ కు అనుకూలంగా తీర్పునిచ్చి ఆదేశాలు జారీ చేశాడు.


Published Oct 23, 2024 11:40:00 AM
postImages/2024-10-23/1729663869_1723123313Indianrailwaywhitebedsheet12024080839f26794ce5180fc3c52a90d196b0c.webp

న్యూస్ లైన్, స్పెషల్ డెస్క్: చిన్న చిన్న మోసాలు చూశాం కాని ఏకంగా నకిలీ ట్రైబ్యునల్ నే ఏర్పాటు చేసి తీర్పులు కూడా ఇచ్చేసే నకిలీ జడ్జి ని మాత్రం ఇప్పుడే చూశాం. గుజరాత్‌లోని అహ్మదాబాద్‌లో జరిగిందీ ఘటన. కోర్టు తనను ఆర్బిట్రేటర్‌గా నియమించిందని చెబుతూ నిందితుడు మోరిస్ శామ్యూల్ క్రిస్టియన్ గాంధీనగర్‌లోని తన కార్యాలయాన్ని కోర్టు రూముగా మార్చేశాడు.  ఏదో ఒకటి రెండేళ్లు కాదు ఏకంగా 2019 నుంచి నడుపుతున్నాడు. ఓ ప్రభుత్వ భూమికి సంబంధించిన కేసులో తన కంప్లయింట్ కు అనుకూలంగా తీర్పునిచ్చి ఆదేశాలు జారీ చేశాడు.


అవి నకిలీ ఆదేశాలని గుర్తించిన అహ్మదాబాద్ సిటీ సివిల్ కోర్టు రిజిస్ట్రార్ హార్దిక్ దేశాయ్ పోలీసులకు ఫిర్యాదు చేయడంతో నకిలీ కోర్టు బాగోతం వెలుగులోకి వచ్చింది.  నిందితుడు మొదట ..ఫేక్ టోల్ గేట్ ను నడిపాడు. అది బయటపడిపోయిన తర్వాత ఓ ఏడాది గ్యాప్ ఇఛ్చి తర్వాత ఫేక్ కోర్టును మొదలుపెట్టాడు. ఐదేళ్లుగా అతడు ఇలా తీర్పులు ఇస్తున్నట్టు గుర్తించారు.


సివిల్ కోర్టులో పెండింగ్‌ కేసులున్న వారిని గుర్తించి వాటిని త్వరగా పరిష్కరిస్తానని నిందితుడు తన కోర్టుకు రప్పించుకునేవాడు. అయితే డబ్బు తీసుకొని ఎవరు ఎక్కువ మొత్తంలో డబ్బులు ఇస్తారో వారికి మాత్రం అనుకూలంగా తీర్పును ఇచ్చేవాడు. తనది నిజమైన కోర్టుగా నమ్మించేందుకు తన అనుచరులను కోర్టు సిబ్బందిగా ఉపయోగించుకున్నట్టు పోలీసులు తెలిపారు. 

newsline-whatsapp-channel
Tags : newslinetelugu court

Related Articles