Game changer:"గేమ్ చేంజర్" తో రికార్డులన్నీ చేంజ్..ఒక్క పాట 12 కోట్లు.!

ఇండియాలోని టాప్ 5 డైరెక్టర్స్ శంకర్ కూడా ఒకరు..  అలాంటి ఈయన డైరెక్షన్ లో రామ్ చరణ్ హీరోగా వస్తున్న మూవీ గేమ్ చేంజర్. అలాంటి ఈ చిత్రంపై భారీగా అంచనాలు పెరిగిపోయాయి. అయితే ఈ


Published Jul 31, 2024 10:48:57 AM
postImages/2024-07-31/1722439757_rajeevkanakala.jpg

న్యూస్ లైన్ డెస్క్: ఇండియాలోని టాప్ 5 డైరెక్టర్స్ శంకర్ కూడా ఒకరు..  అలాంటి ఈయన డైరెక్షన్ లో రామ్ చరణ్ హీరోగా వస్తున్న మూవీ గేమ్ చేంజర్. అలాంటి ఈ చిత్రంపై భారీగా అంచనాలు పెరిగిపోయాయి. అయితే ఈ చిత్రాన్ని ఈ ఏడాది క్రిస్మస్ వరకు విడుదల చేయడానికి నిర్మాత దిల్ రాజు  రెడీ అవుతున్నారట.. అయితే ఇదే సమయంలో పుష్ప2 సినిమా కూడా రాబోతుంది. ఈ విధంగా ఈ రెండు చిత్రాల మధ్య కాస్త గ్యాప్ ఉన్న ఒకటికి ఒకటి పోటీ పడతాయి.

ప్రస్తుతం ఈ చిత్రం కోసం మెగా ఫ్యాన్స్ అంతా కళ్ళల్లో వత్తులు వేసుకుని ఎదురుచూస్తున్నారు. అయితే అలాంటి ఈ చిత్రం గురించి ఈ మధ్య  కాస్త నెగిటివ్ టాక్ వచ్చింది. ఎందుకంటే శంకర్ డైరెక్షన్ లో వచ్చినటువంటి భారతీయుడు 2 సినిమా దారుణంగా విఫలమైంది. ఈ ప్రభావం గేమ్ చేంజర్ పై పడుతుందని అందరూ భావించారు. ఇదంతా నిజం కాదట. గేమ్ చెంజర్ సినిమాని శంకర్ చాలా అద్భుతంగా తెరకెక్కిస్తున్నారని తెలుస్తోంది. ఈ చిత్రం కోసమే భారతీయుడు2 సినిమాని స్పీడ్ గా తీశారట.

ఒక చిన్న పాటలో కూడా ఏమాత్రం తగ్గకుండా ఖర్చుకు వెనకాడకుండా అన్ని హంగులతో చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారని తెలుస్తోంది.  అయితే ఈ సినిమాలోని ఒక్క పాట కోసమే దాదాపు పది కోట్ల నుంచి 12 కోట్ల ఖర్చు చేశారని సీనియర్ నటుడు రాజీవ్ కనకాల ఒక ఇంటర్వ్యూలో చెప్పారు.  సినిమా కథ కూడా అందరికీ నచ్చుతుందని ఈ మూవీలో రామ్ చరణ్ కి జోడిగా కియారా అద్వాని నటిస్తోందని తెలుస్తోంది. ఈ చిత్రంలో ఎస్ జె సూర్య, శ్రీకాంత్, అంజలి, వంటి నటీనటులు కీలక పాత్ర పోషిస్తున్నారట. ప్రస్తుతం రాజీవ్ కనకాల ఈ కామెంట్స్ చేయడంతో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.

newsline-whatsapp-channel
Tags : newslinetelugu shankar game-changer ramcharan rajeev-kanakala

Related Articles