ఛార్జ్‌షీట్‌లో రాజ్‌తరుణ్‌ను నిందితుడిగా చేర్చినట్లు పోలీసులు వెల్లడించారు. లావణ్యతో రాజ్‌తరుణ్ పదేళ్లు సహజీవనం చేస్తున్నట్లు తెలిపారు. పదేళ్లపాటు రాజ్‌తరుణ్-లావణ్య ఒకే ఇంట్లో ఉన్నారని తెలిపారు.
న్యూస్ లైన్ డెస్క్: హీరో రాజ్‌తరుణ్-లావణ్య కేసులో పోలీసులు ఛార్జ్‌షీట్ దాఖలు అయింది. ఛార్జ్‌షీట్‌లో రాజ్‌తరుణ్‌ను నిందితుడిగా చేర్చినట్లు పోలీసులు వెల్లడించారు. లావణ్యతో రాజ్‌తరుణ్ పదేళ్లు సహజీవనం చేస్తున్నట్లు తెలిపారు. పదేళ్లపాటు రాజ్‌తరుణ్-లావణ్య ఒకే ఇంట్లో ఉన్నారని తెలిపారు.
ఇప్పటికే లావణ్య ఇంటి వద్ద పోలీసులు సాక్ష్యాలకు సేకరించారు. రాజ్ తరుణ్, తాను పదేళ్లుగా ప్రేమలో ఉన్నామని, ఇప్పుడు ముంబైకి చెందిన హీరోయిన్‌తో అఫైర్ పెట్టుకున్నారని నార్సింగి పోలీసు స్టేషన్‌లో లావణ్య ఫిర్యాదు చేసింది. ఈ కేసులో రాజ్ తరుణ్ ముందస్తు బెయిల్ తీసుకున్న విషయం తెలిసిందే.