యువన్ శంకర్ రాజా చిక్కుల్లో పడ్డాడు. చెన్నై పోలీసులు యువన్ శంకర్ రాజా మీద కేసు నమోదు చేశారు.
చెన్నైలోని నుంగంబాక్కం ప్రాంతంలో అద్దెకు ఉంటున్న యువన్ శంకర్ రాజా ఇంటి రెంట్ కట్టలేదని కేసు నమోదైంది.
న్యూస్ లైన్ డెస్క్ : ప్రముఖ తమిళ సంగీత దర్శకుడు యువన్ శంకర్ రాజా అటు కోలీవుడ్ తో పాటు.. ఇటు టాలీవుడ్ లో కూడా మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ సంపాదించుకున్నాడు. మ్యూజిక్ మ్యాస్ట్రో ఇళయరాజా సంగీత వారసుడిగా సినీ ఇండస్ట్రీలోకి అడుగు పెట్టిన యువన్.. తక్కువ సమయంలోనే మంచి సంగీతం అందించి సినీ ప్రేమికుల మనసులో స్థానం సంపాదించుకున్నాడు. వరుసగా సినిమాలు.. సంగీత కార్యక్రమాలతో బిజీగా ఉంటూ బాగానే కూడబెట్టుకున్నాడు. అయితే... ప్రస్తుతం యువన్ శంకర్ రాజా చిక్కుల్లో పడ్డాడు. చెన్నై పోలీసులు యువన్ శంకర్ రాజా మీద కేసు నమోదు చేశారు.
చెన్నైలోని నుంగంబాక్కం ప్రాంతంలో అద్దెకు ఉంటున్న యువన్ శంకర్ రాజా ఇంటి రెంట్ కట్టలేదని కేసు నమోదైంది. నుంగంబాక్కం సరస్సు పరిసరాల్లోని అజ్మత్ బేగం అనే ముస్లిం కుటుంబానికి చెందిన ఇంట్లో యువన్ శంకర్ రాజా కొన్నేళ్లుగా అద్దెకుంటున్నాడు. కొన్ని నెలలుగా ఇంటి అద్దె కట్టకుండా యువన్ శంకర్ రాజా ఇబ్బంది పెడుతున్నాడని అజ్మత్ బేగం సోదరుడు.. మహ్మద్ జావిద్ తిరువల్లికేణి డిప్యూటీ కమిషనర్ కి ఫిర్యాదు చేశారు. కొన్ని నెలలుగా అద్దె కట్టడం లేదని.. మొత్తం రూ.20 లక్షల అద్దె బకాయి పడ్డాడని, ఫోన్ చేస్తూ కూడా లిఫ్ట్ చేయడం లేదని జావిద్ పోలీసులకు తెలిపాడు. ఇంటి యజమానికి ఎలాంటి సమచారం అందించకుండా ఇల్లు ఖాళీ చేస్తున్నాడని, ఇప్పటికే చాలా వస్తువులు తరలించారని అజ్మత్ బేగం పోలీసులకు ఫిర్యాదు చేశారు.
భారీ బడ్జెట్ సినిమాలు చేస్తూ.. సంగీత కార్యక్రమాలు చేస్తూ కోట్లు సంపాదిస్తున్న యువన్ శంకర్ రాజా ఇంటి అద్దె చెల్లించలేకపోతున్నాడా అంటూ సోషల్ మీడియాలో నెటిజనులు ప్రశ్నిస్తున్నారు. ప్రస్తుతం ఈ వార్త కోలీవుడ్ ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా మారింది. యువన్ శంకర్ రాజా ప్రస్తుతం విజయ్ ది గోట్, సర్దార్ 2, మారీసన్ వంటి భారీ ప్రాజెక్టులు చేస్తున్నాడు.