Devara: 100మిలియన్ వ్యూస్ మార్క్ "చుట్టమల్లే సాంగ్"..!

కొరటాల శివ డైరెక్షన్లో భారీ బడ్జెట్ తో రాబోతున్న మూవీ దేవర.. ఈ చిత్రంలో పాన్ ఇండియా స్టార్ హీరో జూనియర్ ఎన్టీఆర్ హీరోగా చేస్తున్నారు.  అయితే ఈయన సరసన జాన్వీ కపూర్ హీరోయిన్ గా నటిస్తోంది. ప్రస్తుతం షూటింగ్ 


Published Aug 17, 2024 08:07:37 PM
postImages/2024-08-17/1723905457_chuttamallesong100million.jpg

న్యూస్ లైన్ డెస్క్: కొరటాల శివ డైరెక్షన్లో భారీ బడ్జెట్ తో రాబోతున్న మూవీ దేవర.. ఈ చిత్రంలో పాన్ ఇండియా స్టార్ హీరో జూనియర్ ఎన్టీఆర్ హీరోగా చేస్తున్నారు.  అయితే ఈయన సరసన జాన్వీ కపూర్ హీరోయిన్ గా నటిస్తోంది. ప్రస్తుతం షూటింగ్ జరుపుకుంటున్న ఈ మూవీపై అభిమానులకు ఎన్నో అంచనాలు ఉన్నాయి.

ఈ చిత్రం నుంచి గత 11 రోజుల క్రితం సెకండ్ సింగిల్ బయటకు వచ్చింది.ఫస్ట్ టైం రిలీజ్ అయిన పాటకు మాస్ ఆడియన్స్ నుంచి వచ్చిన స్పందన గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.ఇక సెకండ్ సింగిల్ చుట్టమల్లె అంటూ ఓ సాంగ్ వచ్చింది. ఈ సాంగ్ ఇప్పటికే యూట్యూబ్లో రికార్డు స్థాయి వ్యూస్ అందుకుంటుంది.

 అతి తక్కువ టైంలోనే 50 మిలియన్ వ్యూస్ సొంతం చేసుకొని 75 మిలియన్ వ్యూస్ ను దాటి, కేవలం 11 రోజుల సమయంలోనే 100 మిలియన్ వ్యూస్ సొంతం చేసుకుంది. ఇప్పటివరకు బాలీవుడ్ ఇండస్ట్రీలో పాటలకు ఈ స్థాయిలో వ్యూస్ వచ్చేవి.  కానీ తెలుగు సినిమా కూడా 100 మిలియన్ వ్యూస్ దాటడం రికార్డే అని చెబుతున్నారు సినీ విశ్లేషకులు.

ప్రస్తుతం 100 మిలియన్ మార్కు దాటడంతో  ఎన్టీఆర్ ఫ్యాన్స్ ఆనందం లో మునిగిపోతున్నారు. ఇక దేవర సినిమా కోసం కళ్ళల్లో వత్తులు వేసుకుని ఎదురుచూస్తున్నారు. అయితే ఈ చిత్రం సెప్టెంబర్ 27వ తేదీన ప్రపంచ వ్యాప్తంగా విడుదలకు సిద్ధమయింది.

newsline-whatsapp-channel
Tags : newslinetelugu jr-ntr devara janhvi-kapoor chuttamalle-song koratala-shiva 100-million-views

Related Articles