Committe kurrollu: చిన్న మూవీ కాదు..ట్రైలర్ చూస్తే గూస్ బంప్స్.!

కొత్త నటినటులతో యదువంశీ డైరెక్షన్ లో వచ్చినటువంటి సరికొత్త మూవీ "కమిటీ కుర్రోళ్ళు". ఈ చిత్రం  కొణిదల నిహారిక సమర్పణలో పింక్ ఎలిమెంట్ పిక్చర్స్  ఎల్ ఎల్ పి   శ్రీ రాధా దామోదర్ స్టూడియోస్


Published Jul 27, 2024 10:40:52 AM
postImages/2024-07-27/1722094824_jonnagadda.jpg

న్యూస్ లైన్ డెస్క్: కొత్త నటినటులతో యదువంశీ డైరెక్షన్ లో వచ్చినటువంటి సరికొత్త మూవీ "కమిటీ కుర్రోళ్ళు". ఈ చిత్రం  కొణిదల నిహారిక సమర్పణలో పింక్ ఎలిమెంట్ పిక్చర్స్  ఎల్ ఎల్ పి   శ్రీ రాధా దామోదర్ స్టూడియోస్ వారి జయలక్ష్మి, పద్మజ కొణిదెల  నిర్మిస్తున్నారు. అలాంటి ఈ చిత్రం ట్రైలర్  ఈరోజు  రిలీజ్ చేశారు. ఈ ఈవెంట్ కు  హీరో సిద్దు జొన్నలగడ్డ హాజరై  మాట్లాడుతూ..  కమిటీ కుర్రోళ్ళు ట్రైలర్ చూస్తే చిన్న సినిమాల కనిపించడం లేదని,  చిత్రంలోని విజువల్స్ గూస్ బంప్స్ తెప్పించేలా ఉన్నాయని అన్నారు.

https://youtu.be/5Vr9eW_kb6g

అసలు సినిమా రంగంలో చిన్న సినిమా పెద్ద సినిమా అనేది ఉండదని, ఓ మూవీకి ఎక్కువ ఖర్చు పెడతారు, మరో మూవీకి తక్కువ ఖర్చు పెడతారు తప్ప సినిమా అనేది పెద్దది చిన్నది అనేది ఉండదు అంటూ చెప్పుకొచ్చారు. అలాగే కొత్త నటీనటులతో ఈ చిత్రం తీయడం మామూలు విషయం కాదని, మూవీ ప్రతి ఒక్క ప్రేక్షకులకు నచ్చుతుందని పెద్ద హిట్ అవుతుందని అన్నారు.

అనంతరం నిహారిక మాట్లాడుతూ  ఈ మూవీ కోసం మూడు సంవత్సరాల నుంచి పని చేస్తున్నామని,  ప్రతి ఒక్క నటుడు పాత్రలో నటించడం కాదు జీవించేసారని  అన్నారు. యాదు వంశీ మంచి మూవీ అందించారని  ప్రతి ఒక్క ప్రేక్షకుడు ఆదరించాలని తెలియజేశారు. ఈ ప్రోగ్రాం లో నిర్మాత  ఫణి అడపాక, ప్రొడ్యూసర్ రమేష్,  మ్యూజిక్ డైరెక్టర్లు అనుదీప్ దేవ్, కెమెరామెన్లు, పాల్గొన్నారు. ఈ చిత్రం గురించి సిద్దు జొన్నలగడ్డ  మాట్లాడిన మాటలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

newsline-whatsapp-channel
Tags : newslinetelugu niharika committee-kurrallu-trailer siddu-jonnalagadda yadhu-vamshi

Related Articles