కంది శ్రీనివాస్ రెడ్డి గురించి వార్త రాసినందుకు చంపేస్తామని తన బెదిరించినట్లు, ఇంటికి తన అనుచరులకు కూడా పంపించినట్లు నరేష్ వెల్లడించారు. నిక్కచ్చిగా వార్తలు రాస్తే చంపేస్తారా అని ఆయన ప్రశ్నించారు. బెదిరింపులకు తల వంచుకునేదే లేదని ఆయన స్పష్టం చేశారు.
న్యూస్ లైన్ డెస్క్: జర్నలిస్ట్‌ను చంపేస్తానంటూ కాంగ్రెస్ నేత బెదిరింపులకు పాల్పడినట్లు తెలుస్తోంది. అదిలాబాద్ నియోజకవర్గ కాంగ్రెస్ ఇన్‌ఛార్జ్ కంది శ్రీనివాస్ రెడ్డి తనను చంపేస్తానని బెదిరించినట్లు టీవీ9 జర్నలిస్ట్ నరేష్ సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టారు.
కంది శ్రీనివాస్ రెడ్డి గురించి వార్త రాసినందుకు చంపేస్తామని తన బెదిరించినట్లు, ఇంటికి తన అనుచరులకు కూడా పంపించినట్లు నరేష్ వెల్లడించారు. నిక్కచ్చిగా వార్తలు రాస్తే చంపేస్తారా అని ఆయన ప్రశ్నించారు. బెదిరింపులకు తల వంచుకునేదే లేదని ఆయన స్పష్టం చేశారు.
తన ఫేస్ బుక్, వాట్సప్ ఖాతాలను కూస్తో హ్యాక్ చేసే ప్రయత్నం చేశారని ఆయన ఆరోపించారు. గత 12 ఏళ్లుగా నిజాయితీగా పని చేశానని వెల్లడించారు. ఇటువంటి బెదిరింపులకు భయపడే ప్రసక్తే లేదని స్పష్టం చేశారు.