Devara : ఎన్టీఆర్ ఊచకోత.. టాలీవుడ్ లో టాప్ ప్లేస్ లో దేవర

కొరటాల శివ డైరెక్షన్, ఎన్టీఆర్ యాక్షన్ కోసం సినీ ప్రేమికులు ఉత్కంఠతో ఎదురు చూస్తున్నారు. అయితే.. పుష్ప-2, ఓజీ సినిమాలు కూడా లైన్ లో ఉన్నప్పటికీ అన్నీ సినిమాలను దాటి దేవర టాప్ ప్లేస్ లో నిలిచిందని తాజా సర్వే ప్రకటించింది.


Published Aug 21, 2024 07:11:01 PM
postImages/2024-08-21/1724247661_Devara.jpg

న్యూస్ లైన్ డెస్క్ : కొరటాల శివ దర్శకత్వంలో వస్తున్న దేవర మూవీతో ఎన్టీఆర్ టాలీవుడ్ లో ఊచకోత కోస్తున్నాడు. ఇప్పటికే రిలీజ్ అయిన పోస్టర్లు, పాటలు, టీజర్ సినిమా మీద అంచనాలు డబుల్ చేశాయి. కొరటాల శివ డైరెక్షన్, ఎన్టీఆర్ యాక్షన్ కోసం సినీ ప్రేమికులు ఉత్కంఠతో ఎదురు చూస్తున్నారు. అయితే.. పుష్ప-2, ఓజీ సినిమాలు కూడా లైన్ లో ఉన్నప్పటికీ అన్నీ సినిమాలను దాటి దేవర టాప్ ప్లేస్ లో నిలిచిందని తాజా సర్వే ప్రకటించింది.

ప్రముఖ సోషల్ మీడియా సంస్థ ఆర్మాక్స్ మీడియా నిర్వహించిన మోస్ట్ ఎవైటెడ్ మూవీ ఇన్ టాలీవుడ్ అనే సర్వేలో దేవర పార్ట్ 1 టాప్ లో నిలిచింది. రాబోయే తెలుగు సినిమాల మీద నిర్వహించిన ఈ సర్వేలో పుష్ప2, ఓజీ, జై హనుమాన్, స్పిరిట్ దేవర తరువాతి స్థానాల్లో నిలిచాయి. ఇప్పటికే దేవర మీద భారీ అంచనాలు పెంచుకున్న ఎన్టీఆర్ ఫ్యాన్స్.. ఇప్పుడు టాలీవుడ్ టాప్ ప్రాజెక్టుల్లో నెంబర్ వన్ గా నిలవడంతో సినిమాపై మరిన్ని అంచనాలు పెంచుకున్నారు. ఈ సినిమాలో అందాల తార జాన్వీ కపూర్ హీరోయిన్ గా, సైఫ్ ఆలీ ఖాన్ విలన్ గా కనిపించనున్నారు. సెప్టెంబర్ 27న దేవర థియేటర్లలోకి రానున్నాడు.

newsline-whatsapp-channel
Tags : jr-ntr tollywood movie-news devara latest-news devara-second-song

Related Articles