ఎన్టీఆర్ రాజమౌళి డైరెక్షన్లో వచ్చిన ఆర్ఆర్ఆర్ సినిమా ద్వారా పాన్ ఇండియా స్టార్ అయ్యారు. అలాంటి రాజమౌళి సినిమా తర్వాత ఎన్టీఆర్ కొరటాల శివతో దేవర చిత్రం చేస్తున్న విషయం
న్యూస్ లైన్ డెస్క్: ఎన్టీఆర్ రాజమౌళి డైరెక్షన్లో వచ్చిన ఆర్ఆర్ఆర్ సినిమా ద్వారా పాన్ ఇండియా స్టార్ అయ్యారు. అలాంటి రాజమౌళి సినిమా తర్వాత ఎన్టీఆర్ కొరటాల శివతో దేవర చిత్రం చేస్తున్న విషయం మనందరికీ తెలిసిందే. పాన్ ఇండియా లెవెల్ లో భారీ యాక్షన్ డ్రామా తో వస్తున్నటువంటి ఈ మూవీ పై అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొని ఉన్నాయి. ఇప్పటికే రిలీజ్ అయినటువంటి పాటలు సోషల్ మీడియాలో రికార్డులు సృష్టించాయి. అలాంటి దేవర ఇప్పటికే షూటింగ్ అంతా పూర్తిచేసుకుని సెప్టెంబర్ 27వ తేదీన రిలీజ్ చేయాలని చిత్ర యూనిట్ భావిస్తోంది.
ఇదే తరుణంలో ఈ సినిమాపై పాన్ ఇండియా లెవెల్ లో బజ్ నెలకొని ఉంది. అంతేకాకుండా ఈ మూవీ ట్రైలర్ సెప్టెంబర్ 15వ తేదీన రిలీజ్ చేస్తారంటూ అనేక వార్తలు వినిపిస్తున్నాయి. ఈ క్రమంలోనే దేవర మూవీ తమిళ రైట్స్ ని శ్రీ లక్ష్మీ మూవీస్ వారు 7.5 కోట్లకు సొంతం చేసుకున్నట్టు వార్త వినిపిస్తోంది. దీన్నిబట్టి చూస్తే మాత్రం సినిమాపై దేశవ్యాప్తంగా భారీ అంచనాలు ఉన్నాయని అర్థం చేసుకోవచ్చు.
ఎందుకంటే ఇప్పటివరకు తెలుగు సినిమాలకు తమిళ రైట్స్ పెద్దగా ధర పలికిన దాఖలాలైతే లేవు. తమిళ సినిమాలు తెలుగులో కోట్లు పోసి తెచ్చుకుంటున్నారు. కానీ ఇక్కడ సినిమాలు అక్కడ అంత రేటుకు ఎవరు తీసుకోలేదు. కానీ దేవరా సినిమా 7.30 కోట్ల రేటు పలకడంతో ఇది బ్రేక్ ఈవెన్ అవ్వాలి అంటే 18 కోట్లు వసూలు చేయాల్సిందే అంటున్నారు. ఈ సినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి కాబట్టే వారు అంత రేట్ పెట్టి రైట్స్ కొన్నారు. ఇక ఈ సినిమాలో ఎన్టీఆర్ దీపాత్రాభినయం చేస్తారని తెలుస్తోంది. ఏది ఏమైనా సినిమా భారి హిట్ సాధించాలని ఎన్టీఆర్ అభిమానులు అంటున్నారు.