మెగా ముద్దుబిడ్డ కొణిదెల నిహారిక అంటే టాలీవుడ్ ఇండస్ట్రీలో తెలియని వారు ఉండరు. యాంకర్ గా నటిగా తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకుంది. తాజాగా నిహారిక నిర్మాతగా కూడా మారి ఓ చిత్రాన్ని తెరకెక్కించింది.
న్యూస్ లైన్ డెస్క్: మెగా ముద్దుబిడ్డ కొణిదెల నిహారిక అంటే టాలీవుడ్ ఇండస్ట్రీలో తెలియని వారు ఉండరు. యాంకర్ గా నటిగా తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకుంది. తాజాగా నిహారిక నిర్మాతగా కూడా మారి ఓ చిత్రాన్ని తెరకెక్కించింది. ఈ సినిమా త్వరలో రిలీజ్ అవ్వడానికి సిద్ధంగా ఉంది. ఈ విధంగా నిహారిక ఓవైపు నటిగా, మరోవైపు నిర్మాతగా రెండు పడవల ప్రయాణం సాగిస్తూ తెలుగు, తమిళ చిత్రాలలో చాలా బిజీ అయిపోయింది. ఇదే క్రమంలో నిహారిక ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ పలు ఆసక్తికరమైన విషయాలు బయటపెట్టింది.
తెలుగు ఇండస్ట్రీలోని దర్శకులు తన వెనకాల సూపర్ పవర్స్ ఉన్నాయని, మీరు అనుకోవద్దని, ఏదైనా కథ వస్తే నేనే ఫైనల్ చేస్తానని ఇతరుల జోక్యం అస్సలు ఉండదని చెప్పింది. ఈ విధంగా నిహారిక తనకంటూ ప్రత్యేకమైన బేస్ ఏర్పాటు చేసుకోవాలని ట్రై చేస్తుంది. ఇదే తరుణంలో ఆమె నిర్మాణ సారథ్యంలో "కమిటీ కుర్రాళ్ళు" చిత్రం రాబోతోంది. దీనికి సంబంధించి భారీగా ప్రమోషన్స్ చేస్తోంది నిహారిక. అలాంటి ఈ ముద్దుగుమ్మ సినిమా ఇండస్ట్రీ లోకి ఎంట్రీ ఇచ్చే సమయంలో ముందుగా తన పెదనాన్న చిరంజీవికి చెప్పిందట.
దీంతో మెగాస్టార్ సినిమా రంగంలో పాజిటివ్ ఎంత ఉంటుందో నెగటివ్ కూడా అంతే ఉంటుంది. వాటన్నింటిని తట్టుకొని బయటకు వస్తేనే రాణించగలం అని చెప్పాడట. అలా పెదనాన్న మాటలు విన్నా ఆమె అన్ని ఫిక్స్ అయిపోయి ముందుగా హీరో విశ్వక్సేన్ తో కలిసి ఒక లఘు చిత్రంలో నటించే అవకాశం వచ్చినా చేయలేదట. ఆ తర్వాత అక్కినేని అఖిల్ తో కలిసి ఒక లఘు చిత్రంలో నటించిందట. ఈ మూవీని రాజమౌళి కొడుకు ఎస్ఎస్ కార్తికేయ రూపొందించారని, కానీ జక్కన్న ఇది చూసి రిలీజ్ చేయలేకపోవడమే ఉత్తమమని నిహారికతో అన్నాడట.
ఇలా నిహారిక అఖిల్ తో చేసినటువంటి మొదటి చిత్రాన్ని జక్కన్న వద్దని చెప్పడంతో రిలీజ్ చేయలేదట. ఆ తర్వాత నిహారిక పలు చిత్రాల్లో నటించి సినిమా రిలీజ్ అయినా పెద్దగా ఆకట్టుకోకపోవడంతో ఆమె నటన రంగానికి గుడ్ బై చెప్పి, నిర్మాణరంగంలో అడుగుపెట్టింది. పలు వెబ్ సిరీస్ లకు నిర్మాతగా వ్యవహరిస్తూ, కమిటీ కుర్రాళ్ళు అనే చిత్రాన్ని కూడా తెరమీదికి తీసుకొస్తుంది. త్వరలో ఈ చిత్రం రిలీజ్ అయి ఎంతటి ఆదరణ పొందుతుందో చూడాలి.