Taapsee: తాప్సీ ని దుబాయ్ లో అమ్మేయాలనుకున్నారా.?

ఇండియన్ సినీ హిస్టరీలో చాలామంది హీరోయిన్స్ అటు సౌత్ లో ఇటు నార్త్ లో రాణిస్తూ ఉంటారు. అలాంటి వారిలో కొంతమంది మాత్రమే పాపులర్ అవుతారు. ఇక అలా పాపులర్ అయిన హీరోయిన్లలో తాప్సి కూడా ఒకరు.


Published Aug 10, 2024 02:45:00 PM
postImages/2024-08-10/1723278633_taapsee.jpg

న్యూస్ లైన్ డెస్క్: ఇండియన్ సినీ హిస్టరీలో చాలామంది హీరోయిన్స్ అటు సౌత్ లో ఇటు నార్త్ లో రాణిస్తూ ఉంటారు. అలాంటి వారిలో కొంతమంది మాత్రమే పాపులర్ అవుతారు. ఇక అలా పాపులర్ అయిన హీరోయిన్లలో తాప్సి కూడా ఒకరు. ఇండస్ట్రీకి సౌత్ ద్వారా ఎంట్రీ ఇచ్చిన ఈ ముద్దుగుమ్మ బాలీవుడ్ లో కూడా రాణించింది.

అలా ప్రస్తుతం బాలీవుడ్ సినిమాల్లో హిట్ కొట్టి బాలీవుడ్ లోనే సెటిల్ అయిన ఈ ముద్దుగుమ్మ రీసెంట్ గానే డెన్మార్క్ బ్యాడ్మింటన్ ప్లేయర్ ని ప్రేమించి పెళ్లాడింది. అయితే వీరి మధ్య రిలేషన్ దాదాపు పది సంవత్సరాల కంటే ఎక్కువగానే ఉంది. ఇక ఈమె పెళ్లి విషయం పక్కన పెడితే అప్పట్లో తాప్సిని దుబాయ్ లో అమ్మేస్తారని ఓ టాక్ వినిపించింది.

అయితే అది రూమర్ మాత్రం కాదు అసలు విషయం ఏమిటంటే..తాప్సి దుబాయ్ కి తన బాయ్ ఫ్రెండ్ తో వెకేషన్ కి వెళ్లాలనుకున్న సమయంలో ఆమె ఫ్రెండ్స్ అందరూ ఆమెని మథియాస్ నిన్ను దుబాయ్ తీసుకెళ్లి అమ్మేస్తే ఏం చేస్తావ్ అని భయపట్టించారట. అయితే అప్పుడే ప్రేమ చిగురించింది కాబట్టి మథియాస్ బో ని వాళ్ళు ఎవరూ నమ్మలేదు.కానీ తాప్సి మాత్రం ఆయన మీద పూర్తి నమ్మకంతో దుబాయ్ కి వెళ్లిందట.

అయితే దుబాయ్ వెళ్లే ముందు తన స్నేహితురాళ్ళు అందరూ ఒకవేళ నీకు దుబాయిలో ఏదైనా ఆపద వస్తే మా కజిన్ సిస్టర్ కి ఫోన్ చెయ్యు అని ఓ అమ్మాయి నెంబర్ కూడా ఇచ్చిందట. అలా భయపడుకుంటూనే మొదటిసారి మథియాస్ బోతో దుబాయ్ కి వెకేషన్ కి వెళ్ళింది.ఆ సమయంలో వీరి మధ్య మరింత బంధం ఏర్పడి అప్పటినుండి ఇద్దరూ లివింగ్ రిలేషన్ లో ఉన్నారు.ఇక ఈ ఏడాది ఈ జంట పెళ్లి చేసుకున్నారు

newsline-whatsapp-channel
Tags : newslinetelugu dubai bolly-wood taapsee mathias-boe denmark

Related Articles