సమంత తెలుగు ఇండస్ట్రీలో దశాబ్ద కాలానికి పైగా పాతుకుపోయిన హీరోయిన్. ఇప్పటికీ ఆమె క్రేజ్ ఏమాత్రం తగ్గలేదు. అలా సమంత కేవలం హీరోయిన్ గానే కాకుండా లేడీ ఓరియంటెడ్ పాత్రల్లో కూడా
న్యూస్ లైన్ డెస్క్: సమంత తెలుగు ఇండస్ట్రీలో దశాబ్ద కాలానికి పైగా పాతుకుపోయిన హీరోయిన్. ఇప్పటికీ ఆమె క్రేజ్ ఏమాత్రం తగ్గలేదు. అలా సమంత కేవలం హీరోయిన్ గానే కాకుండా లేడీ ఓరియంటెడ్ పాత్రల్లో కూడా తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపుతో దూసుకుపోతోంది. అలా తన లైఫ్ ఓ రేంజ్ లో వెళుతున్న సమయంలో నాగచైతన్యతో లవ్ లో పడి చివరికి వివాహం కూడా చేసుకుంది. కొన్నాళ్లపాటు సంసారం చేసిన తర్వాత వీరి మధ్య ఏం పుట్టిందో ఏమో విడాకులు తీసుకొని దూరమైపోయారు. ఇక అప్పటినుంచి ఎవరి కెరియర్ వారు చూసుకుంటూ దూసుకుపోతున్నారు.
ఈ క్రమంలోనే సమంత కాస్తా ఆనారోగ్యం బారిన పడి విదేశాల్లో చికిత్స తీసుకొని మళ్లీ సినిమాల్లో దూసుకుపోతోంది. ప్రస్తుతం తెలుగు ఇండస్ట్రీలోనే కాకుండా బాలీవుడ్, హాలీవుడ్ లో కూడా ఆమె నటిస్తోంది. అలాంటి సమంత ఏ పాత్ర చేసిన అందులో ఎంత రిస్క్ ఉన్న నటించడానికి వెనకాడదు. అయితే తాజాగా ఆమె కొన్ని యాక్షన్ సన్నివేశాలు నటిస్తున్న సమయంలో గాయపడ్డట్టు తెలుస్తోంది. ఆ గాయాలకు డాక్టర్లు నీడిల్ ట్రీట్మెంట్ ద్వారా చికిత్స అందిస్తున్నారట.
దీనికి సంబంధించినటువంటి ఒక ఫోటోను సోషల్ మీడియాలో షేర్ చేసింది. ఈ సందర్భంగా ఫోటోకు "గాయాలు లేకుండా నేను యాక్షన్ స్టార్ కాగలనా" అంటూ క్యాప్షన్ ఇచ్చింది. అయితే ఈమె ఎప్పుడు గాయపడింది ఏ సినిమా షూటింగ్ అనేది మాత్రం చెప్పలేదు. ఈ ఫోటో చూసిన సమంత అభిమానులు మీరు తొందరగా కోలుకోవాలి మేడం అంటూ కామెంట్లు పెడుతున్నారు. ఈ విధంగా సమంత కొన్నాళ్ళ పాటు మయోసైటీస్ బారినపడి ఇబ్బందులు పడ్డ విషయం అందరికీ తెలిసిందే.
దాని నుంచి కోలుకొని ఇప్పుడే కెరియర్ లో దూసుకుపోతుందని క్రమంలో ఇలా గాయాలు కావడం అభిమానులను మరింత బాధపెడుతోంది. ప్రస్తుతం సమంత " సీటడెల్ హనీ బన్నీ అనే యాక్షన్ థ్రిల్లర్ వెబ్ సిరీస్ లో చేస్తోంది. ఈ వెబ్ సిరీస్ నవంబర్ 7వ తేదీన అమెజాన్ ప్రైమ్ లో స్ట్రీమింగ్ అవ్వనుంది. ఈ చిత్రం తర్వాత ఆమె బంగారం పేరుతో సినిమా చేయబోతున్నట్టు తెలుస్తోంది.