ఈయన గుర్తున్నాడా..ఇతని భార్య కూడా ఫేమస్ నటి.! 

ఒకప్పుడు తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఎంతో పేరు తెచ్చుకున్నటువంటి నటీనటులు, ఆ తర్వాత కొన్నాళ్ళకు ఫెడ్ అవుట్ అయిపోతున్నారు. ఆఫర్స్ రాక వీరు ఇండస్ట్రీకి దూరమవుతున్నారో లేదంటే


Published Sep 04, 2024 05:52:33 PM
postImages/2024-09-04/1725452553_naveeen.jpg

న్యూస్ లైన్ డెస్క్:ఒకప్పుడు తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఎంతో పేరు తెచ్చుకున్నటువంటి నటీనటులు, ఆ తర్వాత కొన్నాళ్ళకు ఫెడ్ అవుట్ అయిపోతున్నారు. ఆఫర్స్ రాక వీరు ఇండస్ట్రీకి దూరమవుతున్నారో లేదంటే ఇతర బిజినెస్ ల వల్ల దూరమవుతున్నారో తెలియదు కానీ కొంతకాలం ఇండస్ట్రీలో మంచి గుర్తింపుతో దూసుకెళ్లి, ఆ తర్వాత ఇండస్ట్రీకి దూరమై,  ఏదో ఒక సందర్భంలో  మళ్లీ సోషల్ మీడియాలో కానీ లేదంటే ఏదైనా సినీ ఫంక్షన్ లో కనిపించినప్పుడు వారిని చూసి మనం ఆశ్చర్యపోతూ ఉంటాం.

అలాగే ఒకప్పుడు తెలుగు సినిమా ఇండస్ట్రీలో క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా ఎంతో గుర్తింపు పొందిన ఈ వ్యక్తి  ప్రస్తుతం సోషల్ మీడియాలో మరోసారి వైరల్ అవుతున్నాడు. ఆయన ఎవరు అనే వివరాలు చూద్దాం. పైన ఫోటోలో కనిపించే వ్యక్తి నవీన్ ఓలేటి..  వెంకటేష్ హీరోగా వచ్చినటువంటి పేమంటే ఇదేరా సినిమాలో క్యారెక్టర్ చేశారు. ఆ తర్వాత తొలివలపు  చిత్రంలో కూడా నటించారు. ఇవే కాకుండా విక్రమార్కుడు, ప్రేమించుకుందాం రా, నువ్వే నువ్వే, ఇలా ఈయన నటించిన ఎన్నో చిత్రాలు ఉన్నాయి.

అంతేకాదు ఈ నటుడు తెలుగు ఇండస్ట్రీలో చాలామందికి  గుర్తున్నటువంటి నటుడే. అలాంటి నవీన్ ఓలేటి  కేవలం సినిమాల్లోనే కాకుండా బుల్లితెరపై కూడా పద్మవ్యూహం, నాన్న సీరియల్స్ లో కూడా నటించి మంచి క్రేజ్ సంపాదించుకున్నారు. అలా కొన్నాళ్ల నుంచి ఈయన ఇండస్ట్రీలో కనిపించడం లేదు. కానీ ఈయన భార్య మాత్రం ఆయన కంటే ఫేమస్ నటిగా గుర్తింపు తెచ్చుకుంది.

ఇంతకీ ఆమె ఎవరయ్యా అంటే  మధురిమ. ఓవైపు వెండితెరపై మరోవైపు బుల్లితెరపై ప్రత్యేకమైన గుర్తింపుతో దూసుకుపోతోంది. ఆర్ నారాయణమూర్తి డైరెక్షన్ లో వచ్చిన దళం ద్వారా ఇండస్ట్రీలోకి వచ్చింది. తన భర్త చేసిన చాలా సినిమాల్లో నటించింది. ఇందులో విక్రమార్కుడు సినిమా మధురిమకు చాలా పేరు తీసుకువచ్చిందని చెప్పవచ్చు. ప్రస్తుతం వీరిద్దరూ సినిమా   ఇండస్ట్రీకి దూరమై   అమెరికాలో సెట్ అయిపోయారు. వీరికి ముగ్గురు పిల్లలు కూడా ఉన్నారు. అలాంటి వీరి గురించి ప్రస్తుతం సోషల్ మీడియాలో మరోసారి వార్తలు వైరల్ అవుతున్నాయి.

newsline-whatsapp-channel
Tags : news-line vikramarkudu naveen-oleti madhurima premante-edera

Related Articles