Badra: భద్ర మూవీ హీరోయిన్ సత్య గుర్తుందా.. ఇప్పుడు చూస్తే మతిపోతుంది.!

భద్ర సినిమాలో  హీరోయిన్ సత్య అంటే అందరు గుర్తుపడతారు. అలాంటి సత్య ప్రస్తుతం చాలా మారిపోయింది. ఈ ఒక్క మూవీతోనే ఎంతో పాపులారిటీ సొంతం చేసుకున్న ఈ ముద్దుగుమ్మ   ఆ తర్వాత ఇండస్ట్రీకి దూరమైంది.


Published Jul 28, 2024 02:08:29 AM
postImages/2024-07-28/1722150497_satya.jpg

న్యూస్ లైన్ డెస్క్: ఈ మధ్యకాలంలో సోషల్ మీడియాలో ఎక్కడ చూసినా హీరో, హీరోయిన్లకు సంబంధించి పూర్వకాలం ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. అప్పట్లో వారిని చూసినవారు ప్రజెంట్ చూసి, వారిలో కలిగిన మార్పులను గమనించి ఆశ్చర్యపోతున్నారు. ఆ విధంగానే భద్ర సినిమాలో  హీరోయిన్ సత్య అంటే అందరు గుర్తుపడతారు. అలాంటి సత్య ప్రస్తుతం చాలా మారిపోయింది.

ఈ ఒక్క మూవీతోనే ఎంతో పాపులారిటీ సొంతం చేసుకున్న ఈ ముద్దుగుమ్మ   ఆ తర్వాత ఇండస్ట్రీకి దూరమైంది. మరి ఆ వివరాలు ఏంటో చూద్దామా.. మాస్ దర్శకుడు బోయపాటి శ్రీను దర్శకత్వం వహించినటువంటి మొదటి మూవీ ఇది. బ్లాక్ బస్టర్ హిట్టు అందుకున్న ఈ చిత్రంలో మీరాజాస్మిన్ కూడా హీరోయిన్ గా చేసింది.  అంతేకాకుండా ఈ చిత్రానికి దేవిశ్రీ ప్రసాద్ మ్యూజిక్ మరో లెవల్ అని చెప్పవచ్చు. అయితే ఈ సినిమాకు ప్రొడ్యూసర్ గా దిల్ రాజ్ చేశారు.

 ఈ సినిమాలో రవితేజ మరియు సునీల్ తన కామెడీతో ప్రేక్షకులను కడుపుబ్బా నవ్వించారు. వీరితోపాటు ఈ చిత్రంలో సత్యా పాత్రలో మరో హీరోయిన్ చేసింది. ఆమె పేరు సనోబర్ హెరేకర్. సత్య పాత్ర ఆమెకు ఎంతో పాపులారిటీ తీసుకురావడంతో  భద్ర మూవీ సత్యా అని పిలుస్తూ ఉంటారు. ఈ చిత్రం తర్వాత మరో సినిమాలో కనిపించలేదు. ఈ మూవీ వచ్చి 18 సంవత్సరాలు దాటింది.

అయితే సనోబర్  సినిమాల్లో కనిపించక పోయినా కానీ సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ గా ఉంటుంది. అయితే చాలా కాలం తర్వాత ఈ బ్యూటీ బాలీవుడ్ లో ఒక సినిమాలో నటించిందట.ఈ చిత్రం సమయంలోనే ఆమె చాలా ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేయడంతో వైరల్ గా మారింది. దీంతో ఆమెను చూసినవారు ఈమె భద్ర సినిమాలో చేసిన సత్యా కదా అంటూ  ఆశ్చర్యపోతున్నారు.

https://www.instagram.com/reel/Cw7CuP0pNQb/?igsh=djg0ZGk2cjlmbm45

newsline-whatsapp-channel
Tags : newslinetelugu sunil raviteja badra-movie sathya sanobar-herekar meea-jasmine

Related Articles