పవన్ కాల్లోత్తుతూ బర్త్ డే విషెస్ చెప్పిన వ్యక్తిని గుర్తుపట్టారా.. స్టార్ హీరో.!

మెగా హీరో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ పుట్టినరోజు సందర్భంగా సోషల్ మీడియాలో ఎక్కడ చూసినా ఆయనకు విషెస్ చెబుతున్న పోస్టులే కనిపిస్తున్నాయి.  ఇప్పటికే మెగా బాస్ చిరంజీవి తమ్ముడిని


Published Sep 02, 2024 02:57:58 PM
postImages/2024-09-02/1725269278_varuntej.jpg

న్యూస్ లైన్ డెస్క్: మెగా హీరో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ పుట్టినరోజు సందర్భంగా సోషల్ మీడియాలో ఎక్కడ చూసినా ఆయనకు విషెస్ చెబుతున్న పోస్టులే కనిపిస్తున్నాయి.  ఇప్పటికే మెగా బాస్ చిరంజీవి తమ్ముడిని ఆశీర్వదిస్తూ పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేశారు. అంతేకాకుండా  అల్లు అర్జున్ ఇంట్లో నాగబాబు ఇలా పలువురు రాజకీయ నాయకులంతా శుభాకాంక్షలు తెలుపుతున్న తరుణంలో  మెగా హీరో నాగబాబు కొడుకు వరుణ్ తేజ్ బాబాయ్ కి చాలా వెరైటీగా పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేశాడు.

దాంతోపాటు ఒక ఫోటోను షేర్ చేశాడు. ప్రస్తుతం అది నెట్టింటా చక్కర్లు కొడుతోంది. ఈ ఫోటోలో పవన్ సోపాపై కూర్చున్నాడు.  ఇక వరుణ్ తేజ్ బాబాయ్ కాళ్ళు ఒత్తుతూ ఉంటే పవన్ కళ్యాణ్ వారికి వరాలు ఇచ్చే దేవుడులా చేయి చాపాడు. అయితే ఈ ఫోటోలో మెగా మేనల్లుడు సాయి ధరంతేజ్ చేతులు నొక్కుతున్నట్టు కనిపిస్తోంది.

 ఇందులో రామ్ కూడా ఉన్నట్టు కనిపిస్తోంది. ఈ విధంగా బాబాయికి అబ్బాయి కలిసి ఉన్న  స్పెషల్ ఫోటో షేర్ చేసి పుట్టినరోజు శుభాకాంక్షలు చెప్పడంతో అది కాస్త సామాజిక మాధ్యమాల్లో విపరీతంగా వైరల్ అవుతుంది. ఈ ఫోటోని చూసినా మెగా అభిమానులంతా సంబరపడిపోతున్నారు. అన్నయ్యకు వారు కూడా వెరైటీగా శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు.

https://x.com/IAmVarunTej/status/1830455112114098474?s=19

newsline-whatsapp-channel
Tags : newslinetelugu saidharamtej ramcharan varun-tej nagababu happy-birthday-pawankalyan

Related Articles