Heroine: ఈ పాపను గుర్తుపట్టారా.. అప్పట్లో ఇండస్ట్రీలో స్టార్.!

ఈ మధ్యకాలంలో సోషల్ మీడియాలో చాలా మంది నటీనటులు వారి చిన్ననాటి ఫోటోలను షేర్ చేసి అందరినీ మెస్మరైజ్ చేస్తున్నారు. వారి బర్త్ డే లు లేదంటే ఇతర స్పెషల్ ఈవెంట్లలో వారి ఫోటోలను సోషల్ మీడియా వేదికగా


Published Sep 09, 2024 03:30:00 PM
postImages/2024-09-09/1725872373_sneha.jpg

న్యూస్ లైన్ డెస్క్: ఈ మధ్యకాలంలో సోషల్ మీడియాలో చాలా మంది నటీనటులు వారి చిన్ననాటి ఫోటోలను షేర్ చేసి అందరినీ మెస్మరైజ్ చేస్తున్నారు. వారి బర్త్ డే లు లేదంటే ఇతర స్పెషల్ ఈవెంట్లలో వారి ఫోటోలను సోషల్ మీడియా వేదికగా అభిమానులతో పంచుకుంటున్నారు.  ఆ విధంగానే ఒకప్పుడు తెలుగులో స్టార్ హీరోయిన్ అయినటువంటి ఈమె చిన్ననాటి ఫోటోను సోషల్ మీడియా ద్వారా అభిమానులతో పంచుకుంది.

ఇంతకీ ఆమె ఎవరయ్యా అంటే..  హీరోయిన్ స్నేహ. ఈమె మలయాళ చిత్రం ఇంకానే ఓరు నీలాభక్షి తో సినీరంగ ప్రవేశం చేసింది. మొదటి సినిమా ద్వారానే కథానాయికగా మంచి గుర్తింపు పొందింది.  ఈమె పూర్తిగా దుబాయిలో పుట్టి పెరిగినా కానీ తెలుగు భాషలో మాత్రం అనర్గంగా మాట్లాడుతుంది. 2000 సంవత్సరంలో రంభా, జ్యోతిక, సిమ్రాన్, సౌందర్య లాంటి నటీనటులు ఇండస్ట్రీని ఊపుతున్న తరుణంలో  స్నేహ ఎంట్రీ ఇచ్చి కొద్దికాలంలోనే  టాప్ హీరోయిన్ల లిస్టులో చేరిపోయింది.

తెలుగులోనే కాకుండా తమిళ్, మలయాళ, కన్నడ ఇండస్ట్రీలో కూడా తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకుంది. 2001లో మాధవన్ హీరోగా వచ్చినటువంటి ఎన్నవాలే  అనే చిత్రం ద్వారా ఈమె తమిళ ఇండస్ట్రీలోకి ప్రవేశించింది. తెలుగులో గోపీచంద్ హీరోగా వచ్చినటువంటి తొలివలపు సినిమా ద్వారా  మంచి గుర్తింపు తెచ్చుకుంది.  ఇక ఈ సినిమా తర్వాత ఆమెకు ప్రియమైన నీకు అనే చిత్రంలో ఆఫర్ వచ్చింది.అందులో కూడా చేసి అద్భుతమైన హిట్ సాధించింది.

అలా ఇండస్ట్రీలో స్టార్ హీరోలు అయినటువంటి బాలకృష్ణ, నాగార్జున, శ్రీకాంత్,రవితేజ, తరుణ్ వంటి వారి సరసన నటించి  తనకంటూ ప్రత్యేకమైన ఫ్యాన్ ఫాలోయింగ్ ఏర్పాటు చేసుకుంది.  అలాంటి స్నేహ 2012లో ప్రసన్న ని పెళ్లి చేసుకొని ఒక బాబుకు ఒక పాపకు జన్మనిచ్చి కుటుంబ జీవితాన్ని గడుపుతోంది.ఇక స్నేహకి సంబంధించినటువంటి చిన్ననాటి ఫోటో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవ్వడంతో అది చూసిన నెటిజన్స్ షాక్ అయిపోతున్నారు.

newsline-whatsapp-channel
Tags : newslinetelugu sneha prasanna sneha-childhood-pic priyamaina-neeku

Related Articles