Vanitha Vijay kumar:నాలుగో పెళ్లి చేసుకుంటా పిల్లల్ని కూడా కంట.!

సినీ ఇండస్ట్రీ అంటేనే రంగుల కళా ప్రపంచం. ఈ ప్రపంచంలో  బ్రతకాలి అంటే నటన టాలెంట్ తో పాటు అందచందాలు కూడా ఉండాలి. అలాంటి ఇండస్ట్రీ నుంచే ఎలాంటి మెసేజ్ ప్రజలకు


Published Jul 30, 2024 06:15:40 AM
postImages/2024-07-30/1722337190_vijayku.jpg

న్యూస్ లైన్ డెస్క్: సినీ ఇండస్ట్రీ అంటేనే రంగుల కళా ప్రపంచం. ఈ ప్రపంచంలో  బ్రతకాలి అంటే నటన టాలెంట్ తో పాటు అందచందాలు కూడా ఉండాలి. అలాంటి ఇండస్ట్రీ నుంచే ఎలాంటి మెసేజ్ ప్రజలకు ఇచ్చిన  అది తొందరగా రీచ్ అవుతుంది.  అలాంటి సినిమా ఇండస్ట్రీలో ఈ మధ్యకాలంలో విడాకుల పర్వం కొనసాగుతోంది. ఒక్కొక్కరు ఒకటి నుంచి రెండుసార్లు, మూడుసార్లు కూడా పెళ్లిళ్లు చేసుకొని  విడాకులు ఇస్తున్నారు. ఆ వెంటనే పెళ్లి చేసుకుంటున్నారు. ఈ తంతు ఇండస్ట్రీలో చాలా వరకు కొనసాగుతోంది.  

తాజాగా ఒక నటి తాను ముగ్గురికి విడాకులు ఇచ్చి ఇప్పుడు నాలుగో పెళ్లి కూడా చేసుకుంటానని చెబుతూ సంచలనం రేపింది. ఇంతకీ ఆమె ఎవరయ్యా అంటే  కోలీవుడ్ ఇండస్ట్రీలో వివాదాస్పద నటిగా గుర్తింపు ఉన్నటువంటి వనితా విజయ్ కుమార్. 2000 సంవత్సరంలో నటుడు ఆకాష్ ను మొదటి వివాహం చేసుకున్న ఈమె ఇద్దరు పిల్లలకు జన్మనిచ్చింది. ఆ తర్వాత మనస్పర్ధలు రావడంతో ఆకాష్ కు విడాకులు ఇచ్చి  బిజినెస్ మ్యాన్ అయినటువంటి ఆనంద్ ను రెండో పెళ్లి చేసుకుంది.

వీరికి గుర్తుగా కూడా జయనిత అనే కుమారులు జన్మించాడు. ఇదే సమయంలో పెద్ద కుమారుడు విజయ్ హరి తండ్రితో ఉండేలా కోర్టు ఆదేశాలు ఇవ్వడంతో  తాను తండ్రితోనే ఉంటున్నాడు. ఇందులో రెండవ భర్త కూడా విడాకులు ఇచ్చిన తర్వాత తన కొడుకు జయనిత తన తండ్రి వద్దే ఉండగా వనిత దగ్గర తన కుమార్తె జోబికా మాత్రమే పెరుగుతుంది. ఇదే మంచి సమయం అనుకున్న ఈమె 2020లో పీటర్  పాల్ అనే మరో వ్యక్తిని వివాహం చేసుకుంది. కానీ ఇతనితో ప్రొడక్షన్ ఏమి స్టార్ట్ చేయకుండానే మనస్పర్ధలు వచ్చి విడాకులు తీసుకున్నారు.

అలాంటి వనిత విజయ్ కుమార్  నాలుగో పెళ్లికి కూడా చేసుకోబోతున్నట్లు సంకేతాలు ఇస్తోంది. సొంతంగా ఒక యూట్యూబ్ ఛానల్ నడిపిస్తున్న ఈమె అభిమాని అడిగిన ప్రశ్నకు సమాధానం ఇస్తూ మీరు ఎప్పుడు ఊహించని దానికోసం ఎదురు చూడండి, అంటూ సమాధానం ఇచ్చింది. దీంతో మరోమారు పెళ్లి పీటలు ఎక్కబోతున్నారు  అంటూ వార్తలు రాసుకోచ్చారు. పెళ్లి చేసుకోవడమే కాదమ్మా మరోమారు పిల్లల్ని కూడా కనండి అంటూ కామెంట్లు పెడుతున్నారు.

newsline-whatsapp-channel
Tags : newslinetelugu divorce kollywood vanitha-vijay-kumar 4th-marriage

Related Articles