Raviteja : హీరో రవితేజకు ఎమోషనల్ లెటర్.. కాలర్ ఎగరేసి అంటూ..

మీలోని మాస్ హీరోని మిస్ అవుతున్నాము రవన్నా అంటూ ఫ్యాన్స్ రాసిన లెటర్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.


Published Aug 18, 2024 04:45:31 PM
postImages/2024-08-18/1723979731_RavitejaFanLetter.jpg

న్యూస్ లైన్ డెస్క్ : ఏ బ్యాక్ గ్రౌండ్ లేకుండానే సినీ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి ఈ స్థాయికి చేరుకునేందుకు హీరో రవితేజ పడ్డ కష్టం అంతా ఇంతా కాదు. తెర మీద హీరో రవితేజ అని పేరు పడేందుకు ఎంత కష్టపడ్డాడో అందుకే లక్షలాది మంది అభిమానులను సొంతం చేసుకున్నాడు. హిట్.. ఫెయిల్యూర్ తో సంబంధం లేకుండా వరుసగా కొత్త దర్శకులకు అవకాశాలిస్తూ కొత్త సినిమాలతో వస్తూనే ఉన్నాడు. హీరో రవితేజ అనే స్థాయి నుంచి.. మాస్ మహారాజా రవితేజ అనే స్థాయికి ఎదిగాడు. అయితే.. రవితేజ నుంచి ఈ మధ్య వస్తున్న కొన్ని రకాల సినిమాల పట్ల ఆయన ఫ్యాన్స్ కాస్త అసంతృప్తిగా ఉన్నారు. విక్రమార్కుడు, ఖడ్గం, వెంకీ, దుబాయ్ శ్రీను, ఇడియట్, అమ్మానాన్న ఓ తమిళమ్మాయి, భద్ర, నేనింతే, కిక్, నా ఆటోగ్రాఫ్ ఇలా ఎన్నో సూపర్ హిట్ సినిమాలతో టాలీవుడ్ మీద తనదైన ముద్ర వేశాడు రవితేజ. అందుకే ఓ రేంజ్ లో మాస్ ఫ్యాన్స్ ని సంపాదించుకోగలిగాడు. అందుకే రవితేజను ఫ్యాన్స్ అందరూ ప్రేమగా రవన్న అని పిలుచుకుంటారు. అయితే.. రవితేజ తమ అంచనాలకు తగ్గ సినిమాలు చేయడం లేదని, ఆయన రేంజ్ ని తగ్గించుకొని సినిమాలు చేస్తున్నారని ఫ్యాన్స్ కాస్త అసంతృప్తిగా ఉన్నారు. ఈ నేపథ్యంలోనే మీలోని మాస్ హీరోని మిస్ అవుతున్నాము రవన్నా అంటూ ఫ్యాన్స్ రాసిన లెటర్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

ఇదే ఆ లేఖ సారాంశం..

ప్రియమైన రవితేజ అన్నయ్యకి రాస్తున్న ఈ లేఖ ప్రేమతో మాత్రం కాదు. గుండెల్లో చాలా బాధను దిగమింగి రాస్తున్న లేఖ. నాకు చిన్నప్పటి నుంచి మీ సినిమాలే ప్రపంచం. అవి తప్ప ఇంకో ప్రపంచం తెలియదు. అందరూ ఆడుకునే వయసులో ఆడుకున్నారు. చదువుకునే వయసులో చదువుకున్నారు. కానీ.. నేను మాత్రం మీ సినిమానే ప్రపంచంగా.. మీ ఆలోచనలే చదువుగా ఉండిపోయాను. మీకు సినిమా తప్ప ఇంకేం తెలియదు. మాకు నువ్వు తప్ప ఇంకెవరూ తెలియదు. అన్నా.. 2011 మిరపకాయ్ సినిమా తర్వాత క్రాక్ సినిమాలో మళ్లీ మా రవితేజ అన్నయ్య కనిపించారు. ఈ మధ్యలో మీనుంచి వస్తున్న సినిమాలు హిట్ అయినా.. నీ స్థాయి సినిమాలు అయితే కాదు. అర్థం చేసుకుంటావని చెప్తున్నా అన్నా. నువ్వు మాకు దగ్గరగా ఉంటే నిన్ను కౌగిలించుకొని ఏడ్చి మా బాధ చెప్పుకోవాలని ఉంది. దయచేసి మంచి కథలు సెలెక్ట్ చేసుకో. రవితేజ అభిమానుందరూ తల ఎత్తకొని తిరిగేలా హిట్లు ఇవ్వు. థియేటర్ నుంచి కన్నీళ్లతో బయటకు వస్తున్నాం అన్నా. సినిమా సినిమాకు మా కన్నీళ్లు ఎక్కువ అవుతున్నాయి. గర్వంగా కాలర్ ఎగరేసుకొని థియేటర్లోంచి బయటకు వచ్చి చాలా ర జులు అయింది. అలాంటి రోజుల కోసం వెయిట్ చేస్తున్నాం అన్నా’ అంటూ ఓ అభిమాని రాసిన ఈ లేఖ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

newsline-whatsapp-channel
Tags : newslinetelugu tollywood movie-news raviteja news-updates telugu-news

Related Articles