Speaker: గడ్డం ప్రసాద్ కుమార్ అకౌంట్ హ్యాక్..!

 ఆయన ట్విట్టర్ ఖాతాను హ్యాక్ చేసి అసభ్య కరమైన వీడియోలు సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. ఈ విషయాన్ని స్వయంగా గడ్డం ప్రసాద్ కుమార్ స్పష్టం చేశారు. 
 


Published Aug 26, 2024 05:51:07 AM
postImages/2024-08-26/1724669146_gaddamprasad.jpg

న్యూస్ లైన్ డెస్క్: తెలంగాణ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ సోషల్ మీడియా అకౌంట్ హ్యాక్ అయినట్లు తెలుస్తోంది. సోమవారం ఉదయం ఆయనకు సంబంధించిన ట్విట్టర్ అకౌంట్‌ను దుండగులు హ్యాక్ చేశారని ఆయన వెల్లడించారు. ఆయన ట్విట్టర్ ఖాతాను హ్యాక్ చేసి అసభ్య కరమైన వీడియోలు సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. ఈ విషయాన్ని స్వయంగా గడ్డం ప్రసాద్ కుమార్ స్పష్టం చేశారు. 

ఈరోజు ఉదయం తన వ్యక్తిగత ట్విట్టర్ అకౌంట్..  కొంత సమయం పాటు హ్యాకింగ్ అయిందని తెలిపారు. టెక్నికల్ టీం ఈ విషయాన్ని గమనించి వెంటనే తగిన చర్యలు తీసుకుని తిరిగి సెట్ చేశారని వెల్లడించారు. తన ట్విట్టర్ హ్యాకింగ్ అయిన సమయంలో తన అకౌంట్‌లో వచ్చిన వీడియోలు, పోస్ట్‌లతో తనకు సంబంధం లేదని తెలిపారు.

newsline-whatsapp-channel
Tags : ts-news news-line newslinetelugu congress telanganam speaker gaddam-prasad-kumar speaker-gaddam-prasad-kumar

Related Articles