Kumbh Mela: వసంత పంచమి ఒక్క రోజే ..కుంభమేళా లో కోట్ల భక్తులు !

బఉత్తరప్రదేశ్ ఇన్ఫర్మేషన్ విభాగం ప్రకారం ఉదయం 8 గంటలసమయానికి 62.25 లక్షల మంది పవిత్ర స్నానాలు ఆచరించారు.


Published Feb 03, 2025 11:56:00 AM
postImages/2025-02-03/1738564097_bloombergquint20250203wwpfixlwPTI02032025000005B.avif

న్యూస్ లైన్ , స్పెషల్ డెస్క్: వసంతపంచమిని పురస్కరించుకొని కుంభమేళాలో సోమవారం లక్షల మంది భక్తులు , సాధవులు , అఖాడాలు పవిత్రస్నానాలు ఆచరించారు. తెల్లవారి వివిధ అఖాడాలకు చెందిన సాధువులు తమ మహామండలేశ్వరుల ఆధ్వర్యంలో త్రివేణి సంగమానికి చేరుకొని ఉదయం 5 గంటలకు అమృతస్నానం చేశారు. ఉత్తరప్రదేశ్ ఇన్ఫర్మేషన్ విభాగం ప్రకారం ఉదయం 8 గంటలసమయానికి 62.25 లక్షల మంది పవిత్ర స్నానాలు ఆచరించారు. దాదాపు ఆదివారం వరకు 34.97 కోట్ల మంది భక్తులు కుంభమేళాను సందర్శించుకున్నారు.


జనవరి 29న మౌని అమావాస్య సందర్భంగా జరిగిన తొక్కిసలాటలో 30 మంది భక్తులు మరణించారు. సంప్రదాయం ప్రకారం సన్యాసి ,భైరాగి, ఉదాసీన్ అనే మూడు శాఖలకు చెందిన అఖాడాలు ముందుగా నిర్ణయించుకున్నట్లు పవిత్ర స్నానాలు చేస్తున్నారు. ఒక్క రోజే దాదాపు 5 కోట్ల మంది భక్తులు పుణ్యస్నానాలు ఆచరించే అవకాశం ఉందని ప్రభుత్వం అంచనా వేస్తోంది. అలాగే, మాఘ పూర్ణిమను పురస్కరించుకుని ఈ నెల 12న, మహాశివరాత్రి సందర్భంగా 26న కూడా కుంభమేళాకు భక్తులు పోటెత్తే అవకాశం ఉంది. 

newsline-whatsapp-channel
Tags : newslinetelugu prayagraj mahakumbamela

Related Articles