రీసెంట్‌గా జరిగిన అంబానీ పెళ్లి వేడుకలో.. ఐశ్వర్య తన కూతురితో రాగా.. అభిషేక్.. తన పేరెంట్స్ తో కలిసి విడివిడిగా రావడంతో... విడిపోతున్నారనే వార్తలకు ఆజ్యం పోసింది.
న్యూస్ లైన్, స్పెషల్ డెస్క్: ఇప్పుడు ఇండస్ట్రీ అంతా గ్రే డివర్స్ ఫుల్ ఫామ్ లో ఉన్నాయి. ఎక్కడ చూడు ఇవే. కాని ఇంతకీ గ్రే డివోర్స్ అంటే ఏంటో తెలుసా ...గ్రే డివర్స్ అనేది ...ప్రత్యేకమైన డివోర్స్ ... జస్ట్ కపుల్స్ గా మాత్రమే విడిపోతారు. కాని పేరెంట్స్ గా అన్ని బాధ్యతలు కలిసి నెరవేరుస్తారు. పిల్లల ఆలనా , పాలనా అంతా ఇద్దరు చూసుకుంటారు. అయితే ఇప్పుడు యంగ్ జనరేషన్ కంటే వయసైన వారు..పెళ్లై 15 నుంచి 20 యేళ్ల మధ్య వారు మాత్రమే... విడిపోతున్నారు. కారణం ఏదైనా కావచ్చు..కాని విడిపోతున్నారు.
రీసెంట్‌గా జరిగిన అంబానీ పెళ్లి వేడుకలో.. ఐశ్వర్య తన కూతురితో రాగా.. అభిషేక్.. తన పేరెంట్స్ తో కలిసి విడివిడిగా రావడంతో... విడిపోతున్నారనే వార్తలకు ఆజ్యం పోసింది. అంతేకాకుండా... గ్రే డివర్స్ మీద వచ్చిన ఓ పోస్టును అభిషేక్ లైక్ చేయడంతో ఈ గ్రే డివర్స్ అనే పదం ఎక్కువగా ట్రెండ్ అవుతోంది. కలిసి బతకలేం అనుకున్నపుడు.. కొట్టుకు చావడం దేనికి అనేది వారి ప్రశ్న.
వృద్ధాప్యంలో విడిపోవాలని నిర్ణయించుకుంటారు. మనదేశంలో ఇది ఇటీవల ఎక్కువైనప్పటికీ విదేశాల్లో ఇది సర్వసాధారణం. ఈ వృద్ధులు తీసుకునే విడాకులను గ్రే డివోర్స్ అంటారు. సాధారణంగా 40 ఏళ్ల తర్వాత జుట్టు రంగు మారిపోతుంది.అందుకే జుట్టుతో పోల్చి గ్రే డైవోర్స్ అని పేరు పెట్టారు. దీనిని డైమండ్ విడాకులు అని కూడా అంటారు. ఈ డివోర్స్ లో పిల్లలు బాధ్యతలు కాని ..వారి ఆనందాలు కాని ఏం మిస్ అవ్వం కాని భార్యా , భర్తలుగా విడిపోతారు.
కానీ ఈ వయసులో విడాకుల ప్రయోజనం వేరు. సామాజిక ,మానసిక ఒత్తిడి, అవిశ్వాసం దీనికి ప్రధాన కారణం. విడాకులు పిల్లల జీవితాలను ప్రభావితం చేస్తాయి కాబట్టి జంటలు కలిసి జీవించవలసి వస్తుంది. పిల్లలు స్వతంత్ర జీవితాన్ని ప్రారంభించిన తర్వాత, జంట విడిపోవాలని నిర్ణయించుకుంటారు. నిజానికి విడాకుల వల్ల పిల్లలు డిస్టర్బ్ అవ్వకుండా ఉంటారు. ఇది పూర్తి సేఫ్. పిల్లలు ఎవరితో నచ్చితే వారితో ఉండొచ్చు.