Hardik Pandya : ఆ సింగర్ తో హార్దిక్ పాండ్యా డేటింగ్ లో ఉన్నాడా..?

హార్దిక్ పాండ్యా నటాషా స్టాంకోవిచ్ నుంచి విడాకులు తీసుకొని వైవాహిక జీవితానికి ఫుల్ స్టాప్ పెట్టాడు. ఆ తర్వాత బాలీవుడ్ బ్యూటీ అనన్యా పాండేతో డేటింగ్ లో ఉన్నాడని వార్తలొచ్చాయి. అయితే.. ఇప్పుడు తాజాగా పాండ్యా కొత్త గర్ల్ ఫ్రెండ్ తో ఉన్న ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.


Published Aug 14, 2024 02:05:32 PM
postImages/2024-08-14/1723624532_hardikpandyanewgfjasmine.jpg

న్యూస్ లైన్ డెస్క్ : ఐపీఎల్ లో తన పెర్ఫార్మెన్స్ తో ఫ్యాన్ష్ ని నిరాశాకు గురి చేసి.. వరల్డ్ కప్ లో తన సత్తా చాటాడు హార్దిక్ పాండ్యా. టీ20 వరల్డ్ కప్ లో టీమిండియా కప్ గెలవడంలో తన వంతు పాత్ర పోషించి అందరి చేత శెభాష్ అనిపించుకున్నాడు. భార్య నటాషా స్టాంకోవిచ్ నుంచి విడాకులు తీసుకొని వైవాహిక జీవితానికి ఫుల్ స్టాప్ పెట్టాడు. ఆ తర్వాత బాలీవుడ్ బ్యూటీ అనన్యా పాండేతో డేటింగ్ లో ఉన్నాడని వార్తలొచ్చాయి. అయితే.. ఇప్పుడు తాజాగా పాండ్యా కొత్త గర్ల్ ఫ్రెండ్ తో ఉన్న ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

బ్రిటిష్ సింగర్, టీవీ నటి జాస్మిన్ వాలియాతో హర్దిక్ పాండ్యా డేటింగ్ లో ఉన్నట్టు నెట్టింట రూమర్లు వస్తున్నాయి. ఇద్దరూ కలిసి వెకేషన్ కి వెళ్లినట్టు పుకార్లు చక్కర్లు కొడుతున్నాయి. తాజాగా హార్దిక్ ప్యాండా తన ఇన్ స్టాగ్రామ్ అకౌంట్ లో గ్రీస్ లోని ఓ స్విమ్మింగ్ పూల్ దగ్గర నడుస్తూ ఓ వీడియో పోస్ట్ చేశాడు. అంతకు నాలుగు రోజుల ముందే జాస్మిన్ వాలియా కూడా ఇదే లొకేషన్ దగ్గర దిగిన ఫొటోలు ఇన్ స్టాలో పోస్ట్  చేసింది. అయితే.. ఈ రెండు పోస్టులకు ఒకరికొకరు లైకులు కొట్టడంతో వీరిద్దరి మధ్య బంధం మరింత బలపడుతుందని.. లివింగ్ టుగెదర్ లో ఉన్నారని వార్తలొస్తున్నాయి.

newsline-whatsapp-channel
Tags : viral-news india-team latest-news hardik-pandya cricket-player

Related Articles