Harish rao: రుణమాఫీపై కాంగ్రెస్ తలాతోకా లేని మాటలు

మరో మంత్రి ఉత్తంకుమార్ రెడ్డి ఇంకా 17 లక్షల మంది రైతులకు రుణమాఫీ కాలేదన్నారని హరీష్ రావు తెలిపారు. ఏది నిజం.. ఇందులో ఎవరి మాటలు నమ్మాలో ముఖ్యమంత్రి చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు. 


Published Aug 20, 2024 02:51:55 PM
postImages/2024-08-20/1724145715_runamafiharishrao.jpg

న్యూస్ లైన్ డెస్క్: రుణమాఫీపై కాంగ్రెస్ పార్టీ నాయకులు తలాతోక లేకుండా రోజుకో తీరుగా మాట్లాడటం సిగ్గుచేటు అని మాజీ మంత్రి, సిద్ధిపేట BRS ఎమ్మెల్యే హరీష్ రావు ఆగ్రహం వ్యక్తం చేశారు. పూర్తి స్థాయిలో రుణమాఫీ చేశామని ఓవైపు  సీఎం రేవంత్ రెడ్డి చుబుతున్నారు. మరోవైపు పలు కారణాలతో రుణమాఫీ పూర్తి కాలేదని త్వరలోనే మిగిలిన వారి ఖాతాల్లో డబ్బు వేస్తామని మంత్రులు, ఎమ్మెల్యేలు చెబుతున్నారు. దీంతో రుణమాఫీ అంశంపై తీవ్ర అయోమయం నెలకొందని రైతులు వాపోతున్నారు. 

తాజగా, ఈ అంశంపై స్పందించిన హరీష్ రావు తన ట్విట్టర్ ఖాతాలో ఓ పోస్ట్ పెట్టారు. ఖమ్మం వేదికగా సీఎం రేవంత్ రెడ్డి రూ.18వేల కోట్లతో రుణమాఫీ పూర్తిగా చేసినట్లు ప్రకటిస్తే, ఇందుకు భిన్నంగా మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి రుణమాఫీ పూర్తిగా జరగలేదని, ఇంకా రూ.12 వేల కోట్లు కూడా విడుదల చేస్తామని చెప్పినా. మరో మంత్రి ఉత్తంకుమార్ రెడ్డి ఇంకా 17 లక్షల మంది రైతులకు రుణమాఫీ కాలేదన్నారని హరీష్ రావు తెలిపారు. ఏది నిజం.. ఇందులో ఎవరి మాటలు నమ్మాలో ముఖ్యమంత్రి చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు. 

మీరు చెబుతున్నట్లు రుణమాఫీ జరిగి ఉంటే బ్యాంకుల చుట్టూ, వ్యవసాయ కార్యాలయాల చుట్టూ, కలెక్టరేట్ల చూట్టూ రైతులు ఎందుకు చెప్పులరిగేలా తిరుగుతున్నారు. ఎందుకు రోడ్లెక్కి రుణమాఫీ కాలేదనే ఆవేదనతో ఆందోళనలు చేస్తున్నారు? అని హరీష్ రావు ప్రశ్నించారు. ఇప్పటికైనా రైతు రుణమాఫీ పూర్తి కాలేదన్న వాస్తవాన్ని రేవంత్ రెడ్డి ఒప్పుకొని రైతులకు క్షమాపణ చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు. వెంటనే రుణమాఫీపై శ్వేతపత్రం విడుదల చేయాలని తెలిపారు. ఆగస్టు 15 వరకు రైతులందరిని రుణవిముక్తులుగా చేస్తానన్న హామిని సీఎం రేవంత్ రెడ్డి ఇప్పటికైనా నిలబెట్టుకోవాలని బీఆర్ఎస్ పార్టీ పక్షాన డిమాండ్ చేస్తున్నామని హరీష్ రావు తెలిపారు.

newsline-whatsapp-channel
Tags : telangana ts-news tspolitics harishrao

Related Articles