Bunny vs Pawan : అల్లు అర్జున్ వర్సెస్ పవన్ కల్యాణ్.. మధ్యలో బుక్కైన హరీశ్ శంకర్

టాలీవుడ్ లోనే అతిపెద్ద ఫ్యామిలీగా పేరున్న మెగా ఫ్యామిలీలో గొడవలు మొదలయ్యాయి. మొన్నటి ఏపీ ఎన్నికల నుంచి మెగా ఫ్యామిలీ వర్సెస్ అల్లు ఫ్యామిలీ అన్నట్టుగా పరిస్థితి మారిపోయింది


Published Aug 10, 2024 04:58:48 PM
postImages/2024-08-10/1723289328_PawanKalyanvsAlluarjun.jpg

న్యూస్ లైన్ డెస్క్ : టాలీవుడ్ లోనే అతిపెద్ద ఫ్యామిలీగా పేరున్న మెగా ఫ్యామిలీలో గొడవలు మొదలయ్యాయి. మొన్నటి ఏపీ ఎన్నికల నుంచి మెగా ఫ్యామిలీ వర్సెస్ అల్లు ఫ్యామిలీ అన్నట్టుగా పరిస్థితి మారిపోయింది. రెండు కుటుంబాల మధ్య ఏం జరిగిందనేది పెద్దగా బయటపడటం లేదు. అయితే.. 2024 ఎన్నికల్లో అల్లు అర్జున్ వైసీపీ అభ్యర్థికి మద్దతు ఇవ్వడం.. అదే ఎన్నికల్లో పవన్ వైసీపీకి వ్యతిరేకంగా పోటీ చేయడం తెలిసిందే. దీంతో.. మెగా ఫ్యామిలీ విత్ అల్లు ఫ్యామిలీ కాస్త.. మెగా వర్సెస్ అల్లు అన్నట్టు మారిపోయింది. మెగా కుటుంబ సభ్యులు అల్లు అర్జున్ ని సోషల్ మీడియాలో అన్ ఫాలో చేయడంతో ఇద్దరి మధ్య ఏదో జరుగుతుందని ప్రచారం మొదలైంది. ఇప్పటి వరకు ఈ విషయం మీద స్పందించని పవన్ కల్యాన్ డిప్యూటీ సీఎం హోదాలో అటవీ పరిరక్షణ గురించి మాట్లాడుతూ పుష్ప సినిమా మీద పరోక్ష కామెంట్లు చేశారు. హీరోలు అడవులను నరకడం, స్మగ్లింగ్ చేయడమే ఇఫ్పుడు సినిమాల్లో ప్రధాన కథాంశం అయిందంటూ కౌంటర్ వేసిన సంగతి తెలిసిందే. అయితే ఈ విషయమై నెటిజన్లు కౌంటర్లు వేస్తున్నా అల్లు అర్జున్ మాత్రం ఇప్పటి వరకు స్పందించలేదు.

మరోవైపు బన్నీ ఫ్యాన్స్ మాత్రం పవన్ కల్యాణ్ నటించిన సినిమాల్లోని డైలాగులను సోషల్ మీడియాలో షేర్ చేస్తూ ట్రోల్ చేస్తున్నారు. కాగా.. ఇప్పుడు ఈ వివాదంలోకి డైరెక్టర్ హరీశ్ శంకర్ ని కూడా లాగారు బన్నీ ఫ్యాన్స్. పుష్ప సినిమా విడుదల సమయంలో హరీశ్ శంకర్ మాట్లాడిన వీడియోను వైరల్ చేస్తున్నారు. పుష్ప సినిమాలో హీరో గంధపు చెట్లు నరుకుతారు. ఈ సినిమా సమాజానికి ఏం మెసేజ్ ఇస్తుందనుకుంటున్నారు అని అడిగిన ప్రశ్నకు హరీశ్ శంకర్ స్పందించారు. పుష్ప సినిమా చూసి సాఫ్ట్ వేర్లు, ఇతర రంగాల్లో ఉన్న ఉద్యోగులు జాబ్ వదిలేసి గొడ్డలి పట్టుకొని అడవికి పోతారా? అంటూ కౌంటర్ వేశారు. ఫ్యాన్స్ ఏమైనా పుష్పలా మారి చెట్లు నరికి డబ్బులు సంపాదిస్తున్నారా? అంటూ ఉల్టా ప్రశ్నించాడు. సినిమాను సినిమాలాగే చూడాలి అంటూ హరీశ్ శంకర్ అప్పట్లో మాట్లాడిన మాటలను బన్నీ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ చేస్తున్నారు. అన్నీ బాగున్నప్పుడు హరీశ్ శంకర్ మాట్లాడిన మాటలు.. ఇప్పుడు ఇలా తనకే రివర్ష్ అవుతాయని ఊహించలేకపోయాడేమో అంటూ నెటిజనులు కౌంటర్ వేస్తున్నారు. కాగా. ఇప్పటికే రెండుసార్లు వాయిదా పడిన పుష్ప-2 విడుదల డిసెంబర్ 6న రిలీజ్ చేయబోతున్నట్టు ప్రకటించారు మేకర్స్. ఈ నేపథ్యంలో పవన్ కల్యాణ్ చేసిన వ్యాఖ్యలు హాట్ హాట్ గా మారాయి.

 

newsline-whatsapp-channel
Tags : pawankalyan pawan-kalyan alludu movies movie-news allu-aravindh allu-sirish pushpa pushpa2 pawan-first-love harish-shankar allu-arjun-

Related Articles