మాలీవుడ్ ఇండస్ట్రీలో వేసినటువంటి హేమా కమిటీ ద్వారా ఎన్నో విషయాలు బయటకు వస్తున్నాయి. హేమ కమిటీకి గతంలో ఎన్నో ఇబ్బందులు పడ్డటువంటి నటీనటులు అంతా వచ్చి డైరెక్టుగా వారి
న్యూస్ లైన్ డెస్క్: మాలీవుడ్ ఇండస్ట్రీలో వేసినటువంటి హేమా కమిటీ ద్వారా ఎన్నో విషయాలు బయటకు వస్తున్నాయి. హేమ కమిటీకి గతంలో ఎన్నో ఇబ్బందులు పడ్డటువంటి నటీనటులు అంతా వచ్చి డైరెక్టుగా వారి సమస్యలను చెప్పుకుంటున్నారు. ఈ సందర్భంగా తాజాగా ఒక నటి ఇండస్ట్రీలో తాను ఎదుర్కొన్నటువంటి దారుణమైన సంగతుల గురించి బయట పెట్టింది. ఎదుర్కొన్న పరిస్థితులను వింటే మనకే షాక్ అనిపిస్తుంది. ఇంతకీ ఆమె ఏమన్నదయ్య అంటే.. సీనియర్ నటి సౌమ్య ఒక టైంలో ఓ డైరెక్టర్ వల్ల అనేక ఇబ్బందులు పడిందట.
తాను 18 సంవత్సరాల వయసు ఉన్న టైంలో ఒక దర్శకుడు మెంటల్ గా టార్చర్ పెట్టి తనతో ఒక బిడ్డను కనాలని ఆరోపించాడు. అంతేకాదు తన యోని వద్ద రాడ్డు పెట్టి ఆనందం పొందాడు. ఈ విషయాన్ని చాలా ఏళ్ల తర్వాత ఆమె ఇప్పుడు బయట పెట్టడంతో నెట్టుంటా వైరల్ గా మారింది. ఆదర్శకుడు పేరు ఆమె బయట ప్రస్తావించలేదు. ఒకవేళ దర్శకుడు పేరు చెబితే పోలీసులు ఆ కేసును టేకప్ చేస్తా అంటేనే చెబుతానని అంటుంది. నేను 18 సంవత్సరాల వయసు ఉన్నప్పుడే కాలేజీలో ఒక డ్రామాలో నటించాను. నాకు తమిళ ఇండస్ట్రీలో నటించే అవకాశం వచ్చింది. అయితే మొదటి రోజు నేను ఆడిషన్ కి వెళ్లాను.
ఈ ఆడిషన్ లోనే నా చేత తప్పు పనులు చేయడానికి ట్రై చేస్తున్నట్టు అర్థమైంది. దీంతో నేను ఈ చిత్రంలో చేయనని చెప్పేశాను. కానీ ఆ డైరెక్టర్ మాత్రం తన భార్యను నేరుగా మా ఇంటికి పంపి ఆ అమ్మాయి పై చాలా డబ్బు పెట్టాం, ఇప్పుడు ఆమె నటించను అంటే ఎలా అని చెప్పి చివరికి నన్ను ఆ సినిమాలో నటించేలా చేశారు. అయితే ఆ డాక్యుమెంట్లలో మాత్రం ఆ దర్శకుడి భార్య ఆ సినిమాను డైరెక్ట్ చేస్తున్నట్టు ఉంది కానీ, నిజానికి దర్శకుడిగా చేసేది తన భర్త. ఆయన షూటింగ్ అయిపోయిన తర్వాత తన ఇంటికి కూడా తీసుకువెళ్లి అన్ని ఆహార పదార్థాలు ఇచ్చేవారు. నన్ను ఎంతో ఆప్యాయంగా చూసుకుంటున్నట్టు నటించాడు.
అలా ఓసారి నాపై అఘాయిత్యానికి పాల్పడ్డాడు. చివరికి చెప్పుకోలేని పరిస్థితికి తీసుకువచ్చి అలా సంవత్సరం పాటు నన్ను వాడేసుకున్నాడు. ఈ ఘటన నుంచి నేను బయటపడడానికి దాదాపుగా 30 ఏళ్లకు పైగానే పట్టింది. నేనే కాకుండా నాలాంటి ఎంతోమంది అలా ఇబ్బందులు పడుతున్నారని నాకు అప్పుడు అర్థమైంది. ఇలా దర్శకుల, నిర్మాతల చేతిలో ఇబ్బందులు పడ్డ ఎవరైనా సరే ధైర్యంగా వచ్చి బయట చెప్పాలని ఆమె కోరారు. ప్రస్తుతం ఆమె మాట్లాడిన మాటలు సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతున్నాయి.