Heavy rains: చరిత్రలోనే ఇవి డేంజర్ వర్షాలు


Published Sep 01, 2024 10:15:36 AM
postImages/2024-09-01/1725165936_IMG20240901100405640x400pixel.jpg

న్యూస్  లైన్ డెస్క్: భారీ వర్షాలకు తెలుగు రాష్ట్రాలు అతలాకుతలం అవుతున్నాయి. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న కుండపోత వర్షాలకు ఏపీతో పాటు తెలంగాణలోని పలు జిల్లాలు చిగురుటాకులా వణుకుతున్నాయి. 

తెలంగాణలోని మహబూబాబాద్, వరంగల్, సూర్యాపేట, ఖమ్మం రాష్ట్రాల్లోని పలు ప్రాంతాల్లో 27 సెంటీ మీటర్ల నుంచి 43.8 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. హైదరాబాద్ లో శనివారం ఉదయం మొదలయిన వర్షాలు.. ఆదివారం నాడు కూడా కురుస్తూనే ఉన్నాయి. వరుస వర్షాలకు లోతట్టు ప్రాంతాలు నీట మునిగాయి. హైదరాబాద్ లోని రామచంద్ర పురం, చందా నగర్, మూసపేట్, శేరిలింగ్ పల్లి, కూకట్ పల్లి, గాజులరామరం, యూసఫ్ గూడ, హయత్ నగర్, జూబ్లీ హిల్స్, సరూర్ నగర్, కాప్రాలో 8 సె.మీ వర్షం కురిసింది.

newsline-whatsapp-channel
Tags : telangana ap-news ts-news hyderabad rains weather-report weather-update weather-forecast cityrains

Related Articles