ధనుష్ మరో శుభవార్త చెప్పేందుకు రెడీ అవుతున్నాడు. త్వరలోనే రెండో పెళ్లి ఏర్పాట్లలో ఉన్నాడని.. ఇందుకు అన్నీ ఓకే అయినట్టు సోషల్ మీడియాలో వార్తలొస్తున్నాయి.
న్యూస్ లైన్ డెస్క్ : రాయన్ మూవీతో హిట్ కొట్టిన ధనుష్ తమిళంలో వరుస సినిమాలకు సైన్ చేసి దూసుకుపోతున్నాడు. ఇటీవల రిలీజ్ అయిన అన్ని సినిమాలు హిట్ కొట్టి ఫుల్ హ్యాపీగా ఉన్నాడీ కోలీవుడ్ స్టార్. రీసెంట్ గా వచ్చిన రాయన్ మూవీ ఓటీటీ అప్డేట్ కూడా చెప్పేశారు. ఈ సంతోషకర సమయంలోనే ధనుష్ మరో శుభవార్త చెప్పేందుకు రెడీ అవుతున్నాడు. త్వరలోనే రెండో పెళ్లి ఏర్పాట్లలో ఉన్నాడని.. ఇందుకు అన్నీ ఓకే అయినట్టు సోషల్ మీడియాలో వార్తలొస్తున్నాయి.
రజినీకాంత్ కూతురు ఐశ్వర్య రాజేష్ ను పెళ్లి చేసుకున్న ధనుష్ ఇద్దరు పిల్లలు పుట్టిన తర్వాత విడాకులు తీసుకున్న విషయం తెలిసిందే. కాగా.. ఈ మధ్య ఇద్దరూ వేర్వేరుగా ఇల్లు కొనుక్కొని విడివిడిగా గృహప్రవేశం కూడా చేశారు. అయితే.. ఇప్పుడు ధనుష్ తనకు దగ్గరి బంధువుల అమ్మాయితో పెళ్లికి సిద్ధపడ్డాడు. అయితే దీనిపై ధనుష్ ఇప్పటి వరకు ఎలాంటి కామెంట్ చేయలేదు. అయితే.. ధనుష్ పెళ్లి వార్త గురించి సోషల్ మీడియాలో పలు మీమ్స్ వైరల్ అవుతున్నాయి. ధననుష్ బ్రో.. నీ పెళ్లి గురించి తెలిస్తే వేణుస్వామి ముందే జ్యోతిష్యం చెప్తారు.. సీక్రెట్ మెయింటెన్ చెయ్ అంటూ కామెంట్లు పెడుతున్నారు. ఇటీవల నాగచైతన్య, శోభితల పెళ్లి విషయంలో కామెంట్స్ చేసిన వేణుస్వామి ఆ తర్వాత నోటీసులు అందుకొని సారీ చెప్పిన విషయం తెలిసిందే.