HERO NANI : యాక్షన్ క్రైమ్ థ్రిల్లర్ లో నాని ..హిట్టు 3 టీజర్ రిలీజ్ !

నాని టీజర్ రిలీజ్ అయ్యింది. ఈ సినిమాకు సంబంధించిన అప్డేట్ గురువారం వచ్చింది. ‘అతనే ఒక ప్రమాదం’ అనే డైలాగ్ ఆకట్టుకుంది.


Published Sep 05, 2024 03:37:00 PM
postImages/2024-09-05/1725530923_sddefault.jpg

న్యూస్ లైన్, స్పెషల్ డెస్క్ : నేచురల్ స్టార్ నాని సెలక్షన్ సూపర్..ఏ కాన్సప్ట్ మీద చెయ్యి వేస్తే అదే హిట్టు . నేచురల్ స్టార్ నాని అభిమానులు చెప్పే మాట ఇది. హిట్ 3 గ్లింప్స్‌లో నాని ఇచ్చిపడేశారంటున్నారు. అర్జున్ సర్కార్‌గా కనిపించిన ఆయన సీరియస్‌ లుక్‌లో అదరగొట్టేశారు. ఈ మూవీ అప్డేట్ ను గురువారం రిలీజ్ చేశారు.ఈ సినిమాకు సంబంధించిన అప్డేట్ గురువారం వచ్చింది. ‘అతనే ఒక ప్రమాదం’ అనే డైలాగ్ ఆకట్టుకుంది.


 శైలేశ్‌ కొలను దర్శకత్వంలో ‘హిట్‌ 3’ పట్టాలెక్కనుంది. ప్రీ ప్రొడక్షన్ పనుల్లో బిజీగా కూడా ఉన్నారు. ఈ చిత్రం రెగ్యులర్ షూటింగ్ కూడా అతి త్వరలోనే స్టార్ట్ అవ్వబోతుంది .ఈ మూవీలో అర్జున్ సర్కార్ అనే శక్తివంతమైన IAS ఆఫీసర్ గా నాని కనిపించబోతున్నాడు. అయితే ప్రస్తుతానికి వచ్చే యేడాది మే 1 న ప్రపంచవ్యాప్తంగా  రిలీజ్ అవుతుందని టాక్.

క్రైమ్‌ థ్రిల్లర్‌ కథాంశంతో ముస్తాబు కానుంది ఈ సినిమా. హిట్, హిట్ 2 తర్వాత హిట్ 3ని టేకోవర్ చేసుకున్నాడు నాని. టీజర్ రిలీజ్ అధ్భుతంగా ఉంది. మిడిల్ ఏజ్డ్ క్యారక్టర్లో నాని అదరగొట్టేస్తున్నారు. అర్జున్ సర్కార్‌గా జమ్ము కాశ్మీర్ పోలీసుగా కనిపస్తున్నాడు. పోలీసు షర్టుపై రక్తపు మరకలు, కారులో బ్లడ్‌తో తడిసిన గొడ్డలి, నాని చేతికి రక్తం చూస్తే సినిమా సూపర్ డూపర్ యాక్షన్ సినిమా అని తెలుస్తుంది.


‘గెట్, సెట్, గో’ అంటూ ఓ డైలాగుతో నాని సినిమా ఎలా ఉండబోతుందో చెప్పకనే చెప్పేశాడు. త్రిపురనేని ప్రశాంతి ఈ మూవీ తెరకెక్కిస్తోంది. మిక్కీ జే మేయర్ సంగీతాన్ని అందిస్తున్నాడు. హీరోయిన్ గా కేజీఎఫ్ బ్యూటీ  నటిస్తుంది. హిట్: ది ఫస్ట్ కేస్ . 2020లో ఈ చిత్రం విడుదలైంది. . ఇక హిట్ 2లో అడవి శేష్, మీనాక్షి చౌదరి హీరో హీరోయిన్లు. 2022లో వచ్చిన ఈ మూవీ ఎండింగ్‌లో నాని గెస్ట్ అప్పీయరెన్స్ ఇచ్చాడు. ఇప్పుడు హిట్ 3లో నాని కనిపించబోతున్నాడని అప్పుడే హింట్ వచ్చింది. 

 

newsline-whatsapp-channel
Tags : newslinetelugu vishwak-sen crime nani adivi-sesh hit-2

Related Articles