Devara: దేవర సెకండ్ సాంగ్ అప్‌డేట్ వచ్చేసింది

ఈ సినిమాకు సంబంధించి సెకండ్ సాంగ్‌పై మేకర్స్ ఎన్టీఆర్ అభిమానలకు ఆసక్తికర అప్‌డేట్ అందించారు.


Published Aug 02, 2024 07:19:50 AM
postImages/2024-08-02/1722599611_devara2.PNG

న్యూస్ లైన్ సినిమా: టాలీవుడ్ స్టార్ ఎన్టీఆర్ నటిస్తున్న మోస్ట్ అవైటైడ్ సినిమా ‘దేవర’. ఈ మూవీకి కొరటాల శివ ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తుండ‌గా బాలీవుడ్ భామ జాన్వీకపూర్ హీరోయిన్‌గా న‌టిస్తోంది. ఈ సినిమా రెండు పార్టులుగా ప్రేక్షకుల ముందు రానుంది. అయితే ఫస్ట్ పార్ట్ 2024 అక్టోబ‌ర్ 10న విడుదల చేయనున్నట్లు మేకర్స్ అనౌన్స్ చేసిన విషయం తెలిసిందే. ఇప్పటీకే ఈ సినిమా నుంచి విడుదల చేసిన ఫ‌స్ట్ లుక్‌, గ్లింప్స్‌కు రెస్పాన్స్ తెచ్చుకుంది. ఇక ఈ సినిమాకు సంబంధించి సెకండ్ సాంగ్‌పై మేకర్స్ ఎన్టీఆర్ అభిమానలకు ఆసక్తికర అప్‌డేట్ అందించారు.

ఈ సినిమా నుంచి సెకండ్ సింగిల్ 'లవ్ ధమాకా' పాటను ఆగస్టు 5న విడుదల చేయబోతున్నట్లు మూవీయూనిట్ సోషల్ మీడియా వేదికగా తెలుపుతూ కొత్త పోస్టర్‌ను రిలీజ్ చేసింది. తెలుగు, తమిళం, మలయాళం, కన్నడ భాషల్లో ఈ సాంగ్‌‌ను విడుదల చేయనున్నట్లు మేకర్స్ వెల్లడించారు. పక్క మాస్ అండ్ యాక్షన్ ఎంట‌ర్‌టైన‌ర్‌గా తెరకెక్కుతున్న ఈ సినిమాపై అంచనాలు భారీగా ఉన్నాయి. ఈ మూవీ తారక్ సొంత నిర్మణ సంస్థ ఎన్టీఆర్ ఆర్ట్స్‌ బ్యానర్‌పై నందమూరి కళ్యాణ్ రామ్, కొసరాజు హరికృష్ణ సంయక్తంగా నిర్మిస్తున్నారు.

 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by Anirudh (@anirudhofficial)

newsline-whatsapp-channel
Tags : jr-ntr tollywood movie-news devara cinema-news

Related Articles