ఈ సినిమా షూటింగ్ లోనే ఆయన గాయపడినట్లు తెలుస్తోంది. ఆయన కుడిచేతికి గాయమైనట్లు సమాచారం. అయితే, గాయంతోనే ఆయన షూటింగ్‌లో పాల్గొన్నట్లు తెలుస్తోంది.
న్యూస్ లైన్ డెస్క్: టాలీవుడ్ హీరో రవితేజ గాయపడినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం ఆయన RT75 వర్కింగ్ టైటిల్‌తో రానున్న సినిమా షూటింగ్ పనుల్లో బిజీగా ఉన్న విషయం తెలిసిందే. ఈ సినిమా షూటింగ్ లోనే ఆయన గాయపడినట్లు తెలుస్తోంది. ఆయన కుడిచేతికి గాయమైనట్లు సమాచారం. అయితే, గాయంతోనే ఆయన షూటింగ్‌లో పాల్గొన్నట్లు తెలుస్తోంది.
అలాగే షూటింగ్ లోపాల్గొనడంతో గాయం ఎక్కువ అయింది. దీంతో రవితేజను యశోదా హాస్పిటల్‌కు తరలించి చికిత్స అందిస్తున్నారు. రవితేజను డాక్టర్లు సర్జెరీ చేస్తున్నట్లు తెలుస్తోంది. మరో ఆరు వారాల పాటు రెస్ట్ తీసుకోవాలని యశోదా హాస్పిటల్ డాక్టర్లు సూచించారు.